Nara lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ పాదయాత్రలో విపరీతమైన ఆదరణ ప్రజల నుండి కనిపిస్తోంది. రాయలసీమ ప్రాంతంలో అనంతపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట కావటంతో… లోకేష్ పాదయాత్రకి జనాలు జై కొడుతున్నారు. ఇదే సమయంలో అన్ని వర్గాల ప్రజలు లోకేష్ కి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజలు చెప్పే ప్రతి సమస్యను చాలా ఓపికగా వింటూ తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే చేసే పరిష్కారాన్ని కూడా వివరిస్తున్నారు. మరోపక్క వైసీపీ ప్రభుత్వ స్థానిక ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలను కూడా బయటపెడుతున్నారు
దీనిలో భాగంగా ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీరుపై లోకేష్ తనదైన శైలిలో బ్యాక్ టు బ్యాక్ షాక్కులు ఇస్తున్నారు. నిన్న చెరువును కాజేసి అక్రమంగా కట్టిన విలాసవంతమైన కేతిరెడ్డి భవనాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించి అన్నిటిని వీడియో రూపంలో బయట పెట్టడం జరిగింది. అక్కడ అసాంఘిక కార్యకలాపలు జరుగుతున్నట్లు పరిటాల శ్రీరామ్ లోకేష్ కి వివరించారు. రేసింగ్ గుర్రాలు ఇంకా… బోట్ షికార్ వంటి వాటితో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా గెస్ట్ హౌస్ నిర్మించుకుని ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ క్రమంలో లోకేష్ సదరు ఎమ్మెల్యే కేతిరెడ్డి కట్టించిన విళాశావంతమైన భవనాన్ని చూపిస్తూ సెల్ఫీ చాలెంజ్ చేశారు. అయితే నేడు ఎమ్మెల్యే కేతిరెడ్డి నియోజకవర్గం అక్రమ తీసుకు రవాణాకు పాల్పడుతున్నారని లారీలను ఆపేసి.. లోకేష్ మరో ఊహించని షాక్ లు ఇవ్వటం జరిగింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీలను లోకేష్ ఆపిన వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.