ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రస్తావనకు వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని ఆనంకు చెప్పానని కోటంరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికలలో అదే చేస్తారా అని ప్రశ్నించారట. తాను ఎప్పుడూ ఆత్మ ప్రబోధానుసారమే ఓటేస్తానంటూ ఆనం వ్యాఖ్యానించారట.ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. వైసీపీ పార్టీ , ప్రభుత్వ తీరును నిరిసిస్తూ వైసీపీకి దూరమైన కోటంరెడ్డి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
ఆ సమావేశాలకు హాజరయ్యే క్రమంలో ప్లకార్డుతో బయట నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలోని సమస్యల ప్ల కార్డులను ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్రగా వచ్చారు. ప్ల కార్డు ప్రదర్శన వద్దంటూ కోటంరెడ్డిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తనను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదంటూ సమావేశాలకు హాజరయ్యారు.
అసెంబ్లీ లోపలికి వచ్చిన తర్వాత కూడా కోటంరెడ్డి తనదైన శైలిలో మాటల తుటాలతో విరుచుకుపడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారామన్ కోటంరెడ్డిని ఎంతగా కంట్రోల్ చేయాలని ప్రయత్నించిన ఆయన వాదనను ఆయన వినిపిస్తూ వున్నారు. మీ మాటలకు నేను అంగీకరిస్తున్నాను కానీ.. ఇది సభలో మాట్లాడాల్సిన సమయం కాదని భావిస్తున్నా.. అయినా కానీ కోటంరెడ్డి స్పీకర్ మాటలను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని జగన్ పరిపాలనను దూషించారు. ప్రస్తుతం మా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.youtube.com/watch?v=E12YEQ15f8A