kotamreddy-sridhar Reddy :ఇటీవల ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కీ పాల్పడ్డారని నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను వైసీపీ హై కమాండ్ సస్పెండ్ చేయడం తెలిసిందే. ఈ నలుగురిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. ఇటీవల గత కొద్ది నెలల నుండి సొంత పార్టీకి వ్యతిరేకంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. తనదైన శైలిలో పోరాటం చేస్తూ ఉన్నారు. అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. అయితే తాజాగా. జలదీక్షకి గాంధీ గిరి పద్ధతిలో సిద్ధమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అంతేకాకుండా ఆయన ఇంటి చుట్టూ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు
పొట్టెంపాడు బ్రిడ్జి సమస్య నాలుగు నియోజకవర్గాలకు సంబంధించింది. అక్కడ బ్రిడ్జి లేక చాలా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ బ్రిడ్జి కి సంబంధించి అనేక మార్లు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చిన ఎటువంటి పనులు స్టార్ట్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ పార్టీ పెద్దలు చుట్టూ తిరగడం జరిగింది ఇప్పుడు ప్రజా సమస్య విషయంలో నిరంతరం పోరాటం చేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీ గిరి నిరసన చేయటానికి రెడీ అయిన సమయంలో ఉదయాన్నే ఇంత పెద్ద మొత్తంలో పోలీసులు వచ్చి ఇంటిని చుట్టుముట్టటం బాధాకరమని అన్నారు. తనని కలవడానికి వస్తున్న కార్యకర్తలను అడ్డుకుంటున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.