kotam reddy sridhar reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నెల క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తనపై సొంత పార్టీ పెద్దలు నిఘా పెట్టారని మీడియా సమావేశాలు నిర్వహించి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కోటంరెడ్డి వ్యవహారం ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. కాగా అంతకుముందు అమరావతి రైతులను కలవడంతోపాటు సొంత పార్టీపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెగిటివ్ కామెంట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రహస్యంగా కూడా చంద్రబాబుతో… కోటంరెడ్డి భేటీ అయినట్లు వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే అనంతరం తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని వైసీపీ పై తీవ్రస్థాయిలో కోటంరెడ్డి మండిపడటం జరిగింది. అనంతరం కోటంరెడ్డికీ షాక్ ఇచ్చే రీతిలో ఆయన గన్ మెన్ లను వైసీపీ తీసేయడం జరిగింది. అక్కడ వేరే ఇన్చార్జిని నియమించడం జరిగింది.
ఇదిలా ఉంటే నిన్న ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ ఘనవిజయం సాధించటం తెలిసిందే. 23 ఓట్లతో విజయం సాధించింది. బలం 19 ఉన్నాగాని చంద్రబాబు పోటీకి దింపి గెలవటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైసీపీ నుండి నాలుగు ఓట్లు క్రాస్ వోటింగ్ జరిగిందని.. అందుట్లో రెండు కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఓట్లు అయితే మిగతావి… ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఓట్లుగా వైసిపి అనుమానం వ్యక్తం చేస్తుంది.
పరిస్థితీ ఇలా ఉంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి… నేడు భారీ కాన్వాయ్ తో టీడీపీలో జాయిన్ అవటానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నుంచి బయలుదేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కాన్వాయ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఏపీలో తాజా పరిస్థితులు బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. పట్టా బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి దిమ్మ తిరిగే విజయాలు అందుకోవటంతో టీడీపీ గ్రాఫ్ అమాంతంగా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో వైసీపీ నుండి చాలామంది నేతలు జాయిన్ కాబోతున్నట్లు కూడా టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.