kodali Nani : జగన్ కి ట్విస్ట్.. కొడాలి నాని అరెస్ట్ అందుకేనా..

kodali Nani : మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై జారీ చేసిన అరెస్టు వారెంట్‌ పెండింగ్‌పై కోర్టులో విచారణ జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ప్రత్యేక హోదా అంశంపై ర్యాలీ చేశారు. 2016 మే 10న కొడాలి నాని, మాజీ మంత్రి కొలుసు పార్థసారథితో పాటూ మరికొందరు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి వన్‌ వేలో ర్యాలీ చేశారు.

Advertisement

Advertisement

అప్పుడు పోలీసుల ఉత్తర్వులు, నిబంధనలు ఉల్లంఘించినందుకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారన్న ఆరోపణలతో అప్పుడు గవర్నర్‌ పేట పోలీసు స్టేషన్‌లో ఆయన పై కేసు నమోదైంది. కాగా ఆ కేసు విచారణకు కొడాలి నాని కోర్టుకు హాజరు కాకపోవడంతో వారెంట్‌ జారీ చేసింది.

2023 జనవరి 5 నుంచి పెండింగ్‌ లో ఉంది. వాయిదాలకు కొడాలి నాని రాకపోవడంపై విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నరు పేట సీఐ సురేష్‌ కుమార్ గురువారం కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. దాంతో న్యాయమూర్తి గాయత్రీదేవి సీఐని నానిపై అరెస్టు వారెంట్‌ పెండింగ్‌ లో ఉందని దాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి అరెస్టు వారెంట్‌ జారీ చేశారు.

 

Advertisement