Kethi Reddy : చాక్లేట్ ఇచ్చి కేతిరెడ్డి కే ధమ్కీ ఇచ్చిన బుడ్డోళ్లు..

Kethi Reddy :  ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఏపీలో అందరికీ సుపరిచితమే.. అందరి ఎమ్మెల్యే లాగా కాకుండా.. కూల్ గా కనిపిస్తూ హార్డ్ వర్క్ చేసుకుంటూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే తీర్చే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి పలకరింపు నుంచి పనితనం వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేకమే.. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రతిరోజు ఏదో ఒక కాలనీలో కనిపిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారు కేతిరెడ్డి.. ఇక అందులో భాగంగా కేతిరెడ్డి తన నియోజక వర్గంలోని ఒక కాలనీలోని వీధిలోకి వెళ్ళగా.. అక్కడి ప్రజలు తోపాటు పిల్లల్ని కూడా ఆప్యాయంగా పలకరించారు కేతిరెడ్డి.. ఇక స్కూల్ పిల్లలు కేతిరెడ్డి కే ధమ్కి ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ తో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఎమ్మెల్యేగా దూసుకెళ్తున్నారు. చిన్న, పెద్ద , ముసలి వాళ్లు ఉన్న తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటారు. ప్రతిపక్ష పార్టీలపై ఘాటుగా విమర్శలు చేసే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రజలతో మాత్రం ఎంతో సరదాగా ఉంటారు. ఆయన చేసిన చమత్కారాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాగున్నావా పెద్దమ్మ.. బాగున్నావా పెద్దాయన.. బావున్నావా అక్క.. ఏరా చిన్న.. ఏం హీరోస్ అని పలకరింపులతో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో జరిగిన ఫన్నీ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలపై ఘాటుగా విమర్శలు చేసే ఎమ్మెల్యే తన ప్రజలతో మాత్రం చాలా సరదాగా గడుపుతారు.

అందులో భాగంగా ఒక కాలనీ లోని వీధికి కేతిరెడ్డి వెళ్లారు. అక్కడి ప్రజలు తోపాటు స్కూల్ వెళ్తున్న ఒక బుడ్డోడు కేతిరెడ్డి ని చూసి చూడనట్టు స్కూల్ లోపలికి వెళ్తున్నాడు. ఏం హీరో చెప్పులు లేకుండా స్కూల్ లోకి వెళ్తున్నవు. స్కూల్ వాళ్ళు షూస్ ఇచ్చారు కదా.. అవి ఏవీ అని అడుగగా.. ఇంట్లో ఉన్నాయి అని చెబుతాడు. ముందు ఇంటికి పోయి చెప్పులు వేసుకుని రాపో అని అంటాడు. ఏంది చేతిలో అని ఆ కుర్రాడు తింటున్న బఠాణీలు తన చేతిలో కూడా కొన్ని వేసుకుని తింటాడు. ఈ ఒక్క విషయం చూస్తే చాలు కేతిరెడ్డి ఎంత మంచి వారో అర్థం చేసుకోవచ్చు..