KethiReddy ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేరు ఆంధ్రప్రదేశ్ లో తెలియని వారు ఉండరు అనడంలో సందేహమే లేదు.. నిత్యం ప్రజల సమస్యలను అక్కడికక్కడే తీర్చే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి పలకరింపు నుంచి పనితనం వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేకమే.. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రతిరోజు ఏదో ఒక కాలనీలో కనిపిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారు కేతిరెడ్డి.. ఇక అందులో భాగంగా కేతిరెడ్డి తన నియోజక వర్గంలోని ఒక కాలనీలోని వీధిలోకి వెళ్ళగా.. ఆ తల్లి చెప్పే గోడు విని కేతిరెడ్డి అక్కడికక్కడే ఆ అమ్మకు ఆర్థిక సహాయం చేశాడు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
పచారి తేజ అనే అబ్బాయి తనకు తానుగా ప్రాణాలు తీసుకున్న కేసును మీరు ఫైల్ చేశారా అని కేతిరెడ్డి నగరంలోని ఎస్పీకి ఫోన్ చేసి అడుగుతారు. కేసు రిజిస్టర్ చేశారా అని అడుగుతారు. ఎస్పీ చెప్పే మాటలను విన్న తర్వాత ముందు ఆ కేసులో ఎవరైతే ఉన్నారో వారిని అరెస్టు చేయమని.. కేతిరెడ్డి స్వయంగా కుటుంబం ముందే ఫోన్లో మాట్లాడి తగిన న్యాయం చేస్తారు.
అమ్మతోపాటు ఇద్దరు కూతుర్లు వారి భర్తలను కూడా కోల్పోయి ఉండటం చూసి కేతిరెడ్డి గుండె తరుక్కుపోతుంది. ఈ దశదిన కార్యక్రమం జరిగిన తర్వాత నా దగ్గరకు రండి ఈ కేసు గురించి కచ్చితంగా మాట్లాడి మీకు న్యాయం చేపిస్తాను అని కేతిరెడ్డి వారికి హామీ ఇస్తారు.. పచ్చారి తేజ కేస్ లో పోలీసులు విచారణ సరిగ్గా జరపలేదని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అసలు కేసు ఫైల్ చేయలేదని కుటుంబ సభ్యులు కేతిరెడ్డికి జరిగిన సంగతి చెప్పి బోరున విలపించారు. వారి మాటలు విని వెంటనే తన జేబులో ఉన్న డబ్బులు తీసి ఇచ్చారు కేతిరెడ్డి. అంతేకాకుండా తన వారిని పిలిచి తన కారులో ఉన్న 50వేల కట్టను వెంటనే తీసుకొని రమ్మని వాళ్లకి ఆ డబ్బులు కూడా ఇచ్చారు.
కేతిరెడ్డి నీలాంటి మంచి మనసు ఉన్న నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఉండాలని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మరోసారి కేతిరెడ్డి తన మంచి మనసును నిరూపించుకున్నారు. ప్రస్తుతం కేతిరెడ్డి వీళ్ళకి చేసిన సహాయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నీలాంటి నాయకుడు ప్రతి నియోజకవర్గంలో ఉండాలని సామాన్య ప్రజలు ఆశిస్తున్నారు.