Kethi Reddy కేతిరెడ్డి బహుశా ఈ పేరు గురించి నెటిజన్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదు అనే చెప్పొచ్చు.. ఇక పొలిటికల్ ఫాలోవర్స్ కి ఈ పేరు సుపరిచితమే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలలో కేతిరెడ్డి ప్రత్యేకం. ఎందుకంటే సాధారణ ఎమ్మెల్యే లాగా కాకుండా ఆయన ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లారు.. కేతిరెడ్డి నియోజకవర్గం లో చురుగ్గా ఉంటారు. అంతేకాదు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రోజు నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో కాలనీలో పర్యటిస్తూనే ఉంటూ.. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి..
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కొడుకు సూర్య ప్రతాప్ రెడ్డి. సూర్య ప్రతాప్ చదువుతోపాటు గేమ్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటాడు ఇతను ఒక ఫుట్బాల్ ప్లేయర్. ధర్మవరం నియోజకవర్గంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ గేమ్స్ ప్లేయర్స్ అందరూ వరుసగా నిలబడి వారి ఊరు పేరును పరిచయం చేసుకుంటూ ఉన్నారు. వారిలో సూర్య ప్రతాప్ కబడ్డీ జట్టు కూడా ఉంది . ఇక తన కొడుకుని కూడా ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు కేతిరెడ్డి. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఫుట్బాల్ గేమ్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్కడ గేమ్స్ కండక్ట్ చేయడానికి ముందు కేక్ కటింగ్ చేపిస్తారు. నా కేక్ కటింగ్ తను కాకుండా తన కొడుకు సూర్య చేత కట్ చేపిస్తాడు. అయితే ఆ కేకును సూర్యకి పెట్టకుండా అక్కడ ఉన్న మరో హీరో ని అదే ఇంకొక బుడ్డోడిని పిలిచి తినిపిస్తాడు కేతిరెడ్డి. సూర్యకి కూడా పెట్టమని పక్కన ఉన్న వాళ్ళు సలహా ఇస్తుండగా వాడు తిని తిని ఈ మాదిరిగా తయారయ్యాడు అని కేతిరెడ్డి నవ్వుతూ పంచులు వేస్తాడు. అక్కడ ఉన్న అందరినీ పొట్ట చెక్కలు అయ్యేలాగా నవ్విస్తాడు కేతిరెడ్డి.. ప్రస్తుతం కేతి రెడ్డి తన కొడుకు సూర్య కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రి కొడుకుల అనుబంధం, సాన్నిహిత్యం చూస్తూ అందరూ ఆ వీడియోలను వైరల్ చేసే పనిలో పడ్డారు.