carona :కరోనా వైరస్ మళ్లీ డేంజర్ బెల్స్ మెగిస్తోంది. ఫస్ట్, సెకెండ్ వేవ్స్‌లో కరోనా దెబ్బకు అతలాకుతలం అయిపోయిన ప్రపంచదేశాల ప్రజలు.. థర్డ్ వేవ్ అన్న మాట వింటేనే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. మూడో దశలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తర్వాత కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది.
నిన్నొక్క రోజే రాష్ట్రంలో అరవై వేల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,295 పాజిటివ్ కేసులు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలోనే భారీగా కేసులు నమోదవుతున్నాయి. రోజూవారీ కేసుల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో సంక్రాంతి పండగ అనంతరం కఠిన ఆంక్షలు విధించాలని కేసీఆర్ నిర్ణయించారట. అలాగే ఇప్పటికే కేసీఆర్ అధికారుల నుంచి నివేదిక కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇక విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం.. కరోనా అదుపులోకి రాకుంటే స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్స్, బార్లు, పబ్‌లు మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు. మరియు రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి.