Kadiri CI : కదిరి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.. శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం చుట్టుపక్కల ఉన్న షాపులను తొలగించారు. ఇది చిన్న విషయమైనప్పటికీ కూడా.. ఉన్నఫలంగా తమ దుకాణాలను తీసేస్తే ఉపాధి కోల్పోతామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. వారికి తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ చార్జీ కందికుంట వెంకటప్రసాద్ అండగా నిలబడ్డారు.
పూర్తిగా అడ్డం ఉన్న షాపులను మాత్రమే తొలగించాలని మిగతా షాపులను వదిలేయమని టిడిపి ఇన్చార్జి కోరగా ఆలయ అధికారులు అందుకు ఒప్పుకోకపోవడంతో.. వారి మధ్య మాట పెరిగింది దాంతో అక్కడికి సీఐ మధు చేరుకున్నారు. టిడిపి వర్గీయులను అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ సిఐ మధు మధ్య మళ్ళీ మాటలు తూటాల్లా పేలాయి. దాంతో టీడీపీ శ్రేణులు చెన్నై జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
సిఐ మహిళలను సైతం అసభ్య పదజాలంతో దూషించటంతో ఒక్కసారిగా కదిరి పట్టణంలో ఉద్రిక్తలు తలెత్తాయి. సీఐ మధు ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ధర్నా చేపట్టింది. నియోజకవర్గం అక్కడికి వెళ్లారు. అదే సమయంలో వైసీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. సమయంలో కొందరు వ్యక్తులు సీఐ మధును భుజాలపైకి ఎత్తుకోగా.. ఆయన మీసం మేలేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి ఇలా చేయడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. పోలీసులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తల దాడిలో తమ కార్యకర్తలు గాయపడ్డారని టిడిపి నాయకులు వెల్లడించారు . కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప, ఇతర నాయకులు పరామర్శించారు. కదిరి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. వెంటనే కదిరి సీఐ మధుని సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో మాపై దాడి చేయాల్సిన అవసరం లేదని కానీ.. సిఐ మధు అత్యుత్సాహంతో వ్యవహరించాలని ఇలా చేశారని టిడిపి నాయకులు అన్నారు.