NTR Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు కావడం తెలిసిందే. రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు నెల రోజులు నుండి ఉంటున్నారు. మరోపక్క చంద్రబాబుకు బెయిల్ తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా లోకేష్ శత విధాన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో లోకేష్ పెద్దపెద్ద లాయర్లతో మంతనాలు జరుపుతునే జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ లోకేష్ కి దొరకటం లేదని ఎవరు కలవడానికి ఇష్టపడటం లేదని మరోపక్క ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి పరిస్థితులలో చంద్రబాబుకి బెయిల్ కోసం కష్టపడుతున్న..లోకేష్ కి జూనియర్ ఎన్టీఆర్ సాయం చేసినట్లు సరికొత్త వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మేటర్ లోకి వెళ్తే బుధవారం లోకేష్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో బేటి కావడం తెలిసిందే. ఈ భేటీలో పురందేశ్వరితో పాటు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు చేసిన విధానాన్ని ఆయన ఆరోగ్య పరిస్థితులను లోకేష్… అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడం జరిగిందట.
అయితే అసలు ఈ అపాయింట్మెంట్ లోకేష్ కి దొరకటానికి ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ అని సరికొత్త వార్త ఇప్పుడు వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే గతంలో హైదరాబాద్ పర్యటనలో అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం జరిగింది. అయితే ఈ భేటీలో అనేక రాజకీయ విషయాలు కూడా మాట్లాడుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అదంతా పక్కన పెడితే జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. అమిత్ షాతో మాట్లాడి లోకేష్ కి అపాయింట్మెంట్ ఇప్పించటం జరిగిందట. దీంతో ఎన్టీఆర్ దయతోనే లోకేష్.. అమిత్ షా నీ కలిసినట్లు టాక్ వినిపిస్తోంది.