Junior NTR : జూనియర్ ఎన్టీయార్ అసోసియేషన్ రచ్చ మామూలుగా లేదుగా !!

Junior NTR :  జూనియర్ ఎన్టీయార్ ను అవమానిస్తుంటే తాముచూస్తు ఊరుకోవాలా ? అనేది ఇపుడు అభిమానసంఘాలు సంధిస్తున్న ప్రశ్న. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం ఎంత పెద్ద వివాదమవుతోందో అందరు చూస్తున్నదే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనికి చంద్రబాబునాయుడు అండ్ కో జగన్ మీద మాత్రమే టార్గెట్ పెట్టుంటే సరిపోయేది. కానీ తమ్ముళ్ళు ఊరుకోకుండా అనవసరంగా జూనియర్ ఎన్టీయార్ ను కెలికారు.

తమ్ముళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే జూనియర్ ప్రభుత్వంపై విరుచుకుపడిపోతారని. కానీ ఎవరికీ ఇబ్బందిలేని పద్దతిలో జూనియర్ ట్వీట్ చేశారు. దాన్ని తట్టుకోలేని తమ్ముళ్ళు ఎన్టీయార్ వారసత్వాన్ని కూడా ప్రశ్నించారు. దాంతో జూనియర్ అభిమానసంఘాలు రంగంలోకి దిగాయి. ఒక్కసారిగా చంద్రబాబు, లోకేష్ మీద విరుచుకుపడ్డాయి. ఇపుడు సమస్య ఎలాగైపోయిందంటే చంద్రబాబు+ఎన్టీయార్ వారసులను ఒకవైపు మంత్రులు వాయించేస్తుంటే మరోవైపు జూనియర్ అభిమానసంఘాలు ఉతికేస్తున్నాయి.

junior ntr association strategy
junior ntr association strategy

సరిగ్గా ఈ నేపధ్యంలోనే విజయవాడ నగరం మొత్తంమీద చంద్రబాబు ఫొటో ఉన్న పోస్టర్లు వెలిశాయి. అవేమిటంటే ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి సీఎంగా దింపేసి తర్వాత పార్టీని లాగేసుకుని ఆ తర్వాత ఎన్టీయార్ ను పార్టీ అధ్యక్షుడిగా కూడా దింపేసి హోలుమొత్తంమీద బయటకు తరిమేశారు. ఆ సమయంలోనే ఇంగ్లీషుమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడుతు వుయ్ డోంట్ నీడ్ ఎన్టీయార్ అని స్పష్టంగా చెప్పారు. అదే హెడ్ లైన్తో అప్పట్లో బ్యానర్ కథనం వచ్చింది.

ఇపుడా ఇంటర్వ్యూ క్లిప్పింగ్ ను సంపాదించి దాన్ని పోస్టర్లుగా మార్చి విజయవాడంతా అంటింటంతో సోషల్ మీడియాలో వైలర్ అయ్యింది. ఇంతకీ దీన్ని ఎవరు చేశారో మొదట్లో అర్ధంకాలేదు. అయితే జూనియర్ ను అవమానిస్తుంటే తాము చూస్తు ఊరుకోవాలా ? అంటు జూనియర్ అభిమానసంఘాల నేతలు కావూరి కృష్ణ, నున్న గణేష్ నిలదీశారు. జూనియర్ పై టీడీపీ నేతలు అసభ్యకరమైన ట్రోల్స్ ఎదుర్కోవటానికే తాము ఈ పోస్టర్లు అంటించినట్లు చెప్పారు. జూనియర్ మాత్రమే ఎన్టీయార్ కు అసలైన వారుసుడని చంద్రబాబు కుట్రచేసి పార్టీని లాక్కున్నాడంటు మండిపడ్డారు.