JC Prabhakar Reddy : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రజల నుండి ఊహించిన విధంగా రెస్పాన్స్ వస్తోంది. అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర ఏపీ పొలిటికల్ రాజకీయవేడిని పెంచేసింది. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని.. చెరువు కబ్జా చేసి అక్రమంగా బిల్డింగ్ కట్టినట్లు డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియో వైరల్ అయింది.
ఇదిలా ఉంటే లోకేష్ పాదయాత్రని అడ్డుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ క్యాంపు వద్దకు వస్తే పంచెలూడదీసి పరిగెత్తించి కొడతామని పేర్కొన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఊరుకోబోమని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలకు..
జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉత్తర కుమారుడిగా అభివర్ణించారు. వాడికసలు చదువులేదు..ఏమీ లేదు తూ తూ అంటూ.. వాడి గురించి అసలు మాట్లాడుకోవడమే వేస్ట్ అని చెప్పుకొచ్చారు. వాడి గురించి మేము కాదు మా ఇంట్లో పనిమనిషిలే పంచెలు ఊడదీసేలా కొడతారని హెచ్చరించారు. ఇదే సమయంలో ఆరు నెలల తర్వాత పంచెలు ఉడతీయడానికి ప్రజల సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. కానీ మనోడు స్పీడు చూస్తుంటే ముందుగానే పంచే ఉడగోట్టించుకునేందుకు ఆరాటపడుతున్నట్లు కనిపిస్తుందని సెటైర్లు వేశారు. ఆలూరుకు తనను వెళ్లకుండా అడ్డుకున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి పై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.