Categories: ExclusiveNewsPolitics

JC Prabhakar Reddy : వాళ్లకు అసలు టికెట్ ఇవ్వొద్దు జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

JC Prabhakar Reddy  అనంతపురం జిల్లా టీడీపీ కీలక నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన కాసేపు…లోకేష్ తో పాటు అడుగులో అడుగు వేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి కార్యకర్తల బలముందని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఏ ముహూర్తాన పార్టీ ప్రకటించటం జరిగిందో… కార్యకర్తలకు కొదవ లేని పార్టీ టీడీపీ అని కొనియాడారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో మొదటినుండి పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా మధ్యలో వచ్చే వారికి.. టికెట్లు ఇవ్వోద్దని సూచించారు. ఈ మూడున్నర సంవత్సరాల పాటు అనేక అక్రమ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం పార్టీకి మంచి ఊపు వచ్చింది. అందరూ రీఛార్జ్ అయ్యారు. మొన్నటి వరకు కార్యకర్తలు పోరాడుతూ ఉన్నారు.

Jc prabhakar Reddy sensational comments on TDP high command

9

ఇప్పుడిప్పుడే నాయకులు బయటపడుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో దమ్ము ధైర్యం ఉండి అందరిని కలుపుకుని పార్టీనీ ముందుకు తీసుకెళ్లడానికి ఇష్టపడే నాయకులకు టికెట్లు ఇవ్వాలని సూచించారు. పార్టీలో ఇప్పుడు కొత్త రక్తం ప్రవహిస్తుంది. ఇది లోకేష్ టైం. ఆయన ఎంతో కష్టపడి పాదయాత్ర చేస్తూ ఉన్నారు. కార్యకర్తలలో మంచి జోష్ వచ్చింది. ఇలాంటి సమయంలో పార్టీలో దాదాపు 60 శాతం యువతకు టికెట్లు కేటాయించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ గెలుపు కోసం తెగింపు కలిగిన నాయకులకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో తన నియోజకవర్గంలో సైతం యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏది ఏమైనా పార్టీలో ఇప్పుడు వచ్చిన జోష్ ఎన్నికల వరకు కొనసాగించే రీతిలో పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో మీడియా సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.