JC Prabhakar Reddy అనంతపురం జిల్లా టీడీపీ కీలక నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన కాసేపు…లోకేష్ తో పాటు అడుగులో అడుగు వేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి కార్యకర్తల బలముందని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఏ ముహూర్తాన పార్టీ ప్రకటించటం జరిగిందో… కార్యకర్తలకు కొదవ లేని పార్టీ టీడీపీ అని కొనియాడారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో మొదటినుండి పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా మధ్యలో వచ్చే వారికి.. టికెట్లు ఇవ్వోద్దని సూచించారు. ఈ మూడున్నర సంవత్సరాల పాటు అనేక అక్రమ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం పార్టీకి మంచి ఊపు వచ్చింది. అందరూ రీఛార్జ్ అయ్యారు. మొన్నటి వరకు కార్యకర్తలు పోరాడుతూ ఉన్నారు.

9
ఇప్పుడిప్పుడే నాయకులు బయటపడుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో దమ్ము ధైర్యం ఉండి అందరిని కలుపుకుని పార్టీనీ ముందుకు తీసుకెళ్లడానికి ఇష్టపడే నాయకులకు టికెట్లు ఇవ్వాలని సూచించారు. పార్టీలో ఇప్పుడు కొత్త రక్తం ప్రవహిస్తుంది. ఇది లోకేష్ టైం. ఆయన ఎంతో కష్టపడి పాదయాత్ర చేస్తూ ఉన్నారు. కార్యకర్తలలో మంచి జోష్ వచ్చింది. ఇలాంటి సమయంలో పార్టీలో దాదాపు 60 శాతం యువతకు టికెట్లు కేటాయించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ గెలుపు కోసం తెగింపు కలిగిన నాయకులకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో తన నియోజకవర్గంలో సైతం యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏది ఏమైనా పార్టీలో ఇప్పుడు వచ్చిన జోష్ ఎన్నికల వరకు కొనసాగించే రీతిలో పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో మీడియా సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.