JC Prabhakar Reddy : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. మొదటి నుండి ఈ జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట కావడంతో.. జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. అనంతపురం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో లోకేష్ కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి నియోజకవర్గంలో నేడు లోకేష్ అడుగుపెట్టడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు వారి క్యాడర్ లోకేష్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన సమయంలో హారతులు అవ్వడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జెసి అస్మిత్ రెడ్డి కూడా లోకేష్ పాదయాత్రలో పాల్గొని నడవటం జరిగింది.
ఈ క్రమంలో ఆనందోత్సాహంలో పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీన్మార్ స్టెప్పులు వేశారు. మొదటిరోజు లోకేష్ తాడిపత్రి నియోజకవర్గంలో పాదయాత్రకి జనాలు విపరీతంగా రావడం జరిగింది. మండుటెండల్లో ఇసుక వేస్తరాలనంత రీతిలో లోకేష్ పాదయాత్రకి జనాలు బ్రహ్మానందం పలికారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో లోకేష్ చేస్తున్నా పాదయాత్రకి సంబంధించి డ్రోన్ విజువల్స్.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జెసి ప్రభాకర్ రెడ్డి అడ్డాలో కచ్చితంగా ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలవడం తధ్యమని టిడిపి పార్టీ కేడర్ చెప్పుకొస్తుంది. ఏదేమైనా అనంతపురం జిల్లాలో ధర్మవరం ఇంకా తాడిపత్రి నియోజకవర్గలలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ లోకేష్ పాదయాత్రకి బ్రహ్మరథం పలుకుతున్నారు. ఇదే సమయంలో స్థానికంగా సమస్యలు ఇంకా అనేక విషయాలు గురించి ప్రజలు లోకేష్ కి విన్నవించుకుంటున్నారు. తన దృష్టికి వచ్చే ప్రతి సమస్యను లోకేష్ శ్రద్ధగా వింటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.