Janasena : టీడీపీని జనసేన బాగా ఇబ్బందిపెడుతోందా ?

Janasena:  క్షేత్రస్ధాయిలో ఇపుడిదే అంశంపై జనాల్లో బాగా చర్చ మొదలైంది. ఇపుడు టీడీపీ సమస్య ఏమిటంటే జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళటం చాలామందికి ఇష్టంలేదు. అలాగని జనసేనను కాదని విడిగా ఎన్నికలను ఎదుర్కోనే ధైర్యం చేయలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే కాపుల ఓట్లే. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఓటుబ్యాంకు బాగా పెరుగుతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. జనసేనకు ఓటుబ్యాంకు బాగా పెరుగుతుందనే ప్రచారానికి ప్రత్యేకంగా హేతువంటు ఏమీలేదు.

Advertisement

Advertisement

వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపుకు మెగాఫ్యాన్సంతా కృషి చేయాలనే నిర్ణయం జరిగింది. ఇందులో భాగంగానే మెగాఫ్యాన్సులో ఉండేవారిలో కొందరు యూట్యూబ్ ఛానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాట్లాడుతు జనసేనకు ఓటుబ్యాంకు బాగా పెరుగుతుందన్నారు. దాంతో జనసేనకు ఓటుబ్యాంకు పెరుగుతుందనే ప్రచారం అలా పెరిగిపోయింది. జనసేన మొదటినుండి కూడా బాగా టార్గెట్ చేసిన జిల్లాలు ఉభయగోదావరి జిల్లాలే. ఎందుకంటే ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల జనాభా బాగా ఎక్కువగా ఉంది.

ఈ రెండుజిల్లాల్లోనే 34 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజారిటి సీట్లు వస్తాయో అదే పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంటు బలంగా ఉంది. అందుకనే ఏపార్టీ అయినా ఉభయగోదావరి జిల్లాలపైనే ఎక్కువగా దృష్టిపెడుతుంది. ఇపుడు సమస్య ఏమిటంటే టీడీపీ కూడా ఈ రెండుజిల్లాల్లోనే మ్యాగ్జిమమ్ సీట్లు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది. తన ప్లాన్ వర్కవుటవ్వాలంటే ఒంటరిగా పోటీచేస్తే సాధ్యంకాదని అర్ధమైంది. జనసేనతో పొత్తుపెట్టుకుని పోటీచేస్తే రెండుజిల్లాల్లోను అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చనే వాదన టీడీపీలో ఉంది.

ఇందులో భాగంగానే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఒకవైపు జనసేన మద్దతులేకపోయినా అధికారంలోకి వచ్చేస్తామనే వాదన మరోవైపు టీడీపీలో పెరిగిపోతోంది. దీంతో ఏమిచేయాలో చంద్రబాబుకు అర్ధం కావటంలేదు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలంటే ఉభయగోదావరి జిల్లాల్లో సీట్లను జనసేనకు త్యాగంచేయక తప్పదనే చర్చ టీడీపీలో పెరిగిపోతోంది. ఈ రెండు జిల్లాల్లో టీడీపీ చేసే త్యాగంవల్ల మిగిలిన చోట్ల లాభదాయకంగా ఉంటుందనేది కొందరు నేతల వాదన.

అయితే ఇలాంటి కాంబినేషన్లన్నీ మాట్లాడుకోవటానికి, వాదనకు బాగానే ఉన్నా ఎన్నికల్లో ఎంతవరకు వర్కవుటవుతాయో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మాథమేటిక్స్ 1+1= 2 అవుతుంది. కానీ రాజకీయాల్లో 1+1= 2 అవచ్చు లేదా ఒక్కోసారి 0 కూడా కావచ్చు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే కాపుల్లో ఎంత సానుకూలత ఉంటుందో చెప్పలేం కానీ నాన్ కాపుల్లో మాత్రం మైనస్ అవుతుందేమో అనే టెన్షన్ కూడా టీడీపీలో ఉంది. అదీముఖ్యంగా బీసీలు, కమ్మోరిలో. టీడీపీ కోణంలో ఆలోచిస్తే ఎవరితో పొత్తుపెట్టుకుంటో తెలీదు కానీ జనసేన కోణంలో మాత్రం టీడీపీకి బాగా ఇబ్బందులు తప్పేట్లు లేదనేచెప్పాలి. ఇందుకనే జనసేనతో పొత్తు పెట్టుకోవాలా ? లేకపోతే జనసేనను దూరంగా పెట్టి ఒంటరిగానే పోటీచేయాలాని టీడీపీ తేల్చుకోలేకపోతోంది.

Advertisement