Janasena-BJP : బీజేపీ జనసేన ఈ రెండు పొత్తులో ఉన్న పార్టీలు. కానీ రెండు పార్టీలు కలసి అడుగులు వేసిన దాఖలాలు మాత్రం ఎక్కడ కనబడవు. వైసీపీ మీద పవన్ కళ్యాణ్ చేసే ఏ ఒక్క పోరాటంలో ను బీజేపీ నేతలు కానీ వారి జెండాలు కానీ ఎక్కడా కనబడవు మరి ఇంక పొత్తు దేనికోసమో తెలియని పరిస్థితి. ఈ రకమైన వ్యవహారం చూసి విసిగి పోయిన పవన్ కళ్యాణ్ తన దారి తాను చూసుకునే పనిలోఉన్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఏపీ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వాడుకోవాలన్న ఉద్దేశ్యం తో నువ్వు మా వాడివి అని చెప్పుకునేందుకు ఏకంగా అరగంట పాటు పవన్ తో ప్రధాని మోడీ భేటీ ఏర్పాటు చేసి వీరి మధ్య పొత్తు ఉంది అనిపించేలా గేమ్ నడిపించారు. ఇక ఏపీలో బీజేపీ నేతలు, పవన్ కలసి ముందుకు వెళ్తారు అని భావించారు. కానీ ప్రధాని వెళ్లడం తో నే జనసేన, బీజేపీ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీలను పరిశీలించి అక్కడ అక్రమాలను ప్రశ్నించడానికి పవన్ వెళ్తే ఆ కార్యక్రమంలో ఒక్క బీజేపీ జెండా కూడాఅనిపించకపోవడం తో అసలు పొత్తు ఉందా లేదా అనే అనుమానం మళ్ళి మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ విషయంలో తొందరపడకుండా అడుగులు వేయాలి అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం మీద శక్తి వంతం గా పవన్ పోరాడుతున్నప్పటికీ బీజేపీ మాత్రం కలవడం లేదు అన్న భావన జనసేనలో బలం గా కనిపిస్తుంది.
దేశంలో ఎక్కడా కొంచెం కూడా బలంలేకపోయినా అధికారాన్ని మాత్రం సొంతం చేసుకున్న బీజేపీ ఏపీలో పవన్ చరిష్మాను అడ్డుపెట్టుకుని ఎదగాలని చూస్తుంది అని అంటున్నారు రాజకీయా నిపుణులు. బీజేపీ వ్యవహార శైలి ఈ విధం గా ఉండడంతో.. ఏపీలో ఏ మాత్రం బలం లేని బీజేపీ తో ఎందుకు కలసి నడవాలి అని చాలా మంది నేతలు అంటున్నారట. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండగా ఉంటే వైసీపీతో పోరటానికి కొత్త శక్తిని ఇస్తుంది అని అనుకుంటే ఉన్న శక్తినికూడా లాగేసుకునే ప్రయత్నం చేస్తుంది అని జనసేనలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణం గా బీజేపీ విషయంలో పవన్ తన నిర్ణయం మార్చుకోవాలని సూచిస్తున్నారట. అయితే ప్రస్తుతానికి మాత్రం మౌనంగా మన పని మనం చేసుకుపోవాలని పవన్ సూచించారట. ఎన్నికల దగ్గర లో ఒక కీలక నిర్ణయం జనసేన నుంచి వస్తుంది అని తెలుస్తుంది.