Best House Model : ఒక సెంటు భూమిలోనే ఇల్లు భలే కట్టుకున్నారు చూడండి..

Best House Model : ఇల్లు కట్టడం లేదు ఊర్లే కడుతున్నాం.. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఇంటి స్థలంతో పాటు ఇల్లు కేటాయించడం ఇది జగనన్న కాలనీలపై సీఎం జగన్ మొదలుకొని.. ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చెబుతున్న మాట. ఐదు లక్షలలో ఇల్లు నిర్మించి మరీ లబ్ధిదారులకు తాళం చెవితో సహా ఇస్తామని ప్రకటించినది జగన్ ప్రభుత్వం.. జగనన్న కేటాయించిన ఒక సెంటు భూమిలో ఇల్లు ఎలా కట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం..

48 గజాల స్థలంలో కిచెన్, రెండు డబల్ బెడ్రూమ్స్, రెండు బాత్రూమ్స్ వచ్చే విధంగా ఇంటిని నిర్మించుకోవచ్చు. ఒక బాత్రూమ్ కిచెన్ వెనకమాల వస్తే మరొక బాత్రూం మెట్ల భాగం కింద వస్తుంది. వీటన్నింటినీ టైల్స్ తో అందంగా అలంకరించుకోవచ్చు. కిచెన్ లోనే పూజ మందిరం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కాకపోతే కిచెన్ కాస్త ఇరుకుగా అనిపిస్తుంది. సామాన్లన్నీ నీటుగా సర్దుకుంటే సరిపోతుంది.

ఇక రెండు బెడ్రూమ్స్ లో కూడా సీలింగ్ చేయించుకొని అందమైన సీలింగ్ లైట్స్ ఫిట్ చేసుకోవచ్చు.. బెడ్రూమ్స్ కాస్త విశాలంగా ఉండాలి అంటే హల్ బాగానే తగ్గించుకోవలసి ఉంటుంది. ఇక మధ్యలో ఉన్న బెడ్ రూమ్ తో పోలిస్తే రెండో బెడ్ రూమ్ మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. ఈ రూమ్ లో మంచం, సోఫా, టీ పై లాంటివి ఏర్పాటు చేసుకుంటే ఇల్లు ఇంకా అందంగా కనిపిస్తుంది.

పైన కనిపిస్తున్న వీడియోలో ఒక్క సెంటు భూమిలో ఇల్లుని మనకు నచ్చినట్టుగా మన అవసరాలకు అనుగుణంగా ఏ విధంగా కట్టుకోవచ్చు. అలాగే ఆ వీడియోలో చెప్పిన విధంగా చాలా తక్కువ బడ్జెట్ తో ఒక సెంటు భూమిలోనే చక్కటి ఇంటిని కూడా రూపొందించుకోవచ్చు. జగనన్న కాలనీలో సొంతింటి కల నెరవేర్చుకోవడం సులభం. అది కూడా తక్కువ బడ్జెట్ లో.. మనకి అనుగుణంగా.. జగనన్న లేఅవుట్లలో రోడ్లు తాగునీరు విద్యుత్ సరఫరా ఇతర అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.