YS Jagan : అమ్మా రోజా , కొడాలి నాని ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..

YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడప గడప కార్యక్రమం గురించి ఎమ్మెల్యేలకు సూచనలు ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యేకు నేను చెప్పేది ఒక్కటే.. చాలా సీరియస్ గా తీసుకోండి.. ఎలక్షన్స్ మరో 400 రోజులు రానున్నాయి.. 14 నెలలు కాలంలోనే ఎన్నికలు జరగనున్నాయి.. మనం యుద్ధం చేస్తూనే ఉన్నాము. కానీ మనం ఇంతకుముందు యుద్ధం చేసినట్టుగా చంద్రబాబు నాయుడుతోనే కాదు.. చెడిపోయిన మీడియా వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాము.

ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5 ఇలాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాము.. వీళ్ళందరూ కూడా ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా చూపించే వాళ్ళు.. మన పార్టీ కార్యక్రమాలకు కూడా ఒకవైపున అనుకున్న విధంగా జరగాలి అంటే.. గృహ సారధులు అనేవారు చాలా ముఖ్యమైన వారు.. మీరందరూ కూడా ప్రతి గృహ సారధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఐదు నిమిషాలు కేటాయించి మాట్లాడేలా చూసుకోవాలి.. మీరు వాళ్లకు దగ్గర కాగలిగితేనే వాళ్లు మనకి దగ్గర కాగలరు. ఇది చాలా ముఖ్యమైనది ఇలాంటి క్వాలిటీకి సంబంధించిన విషయాలు మన గృహ సారథులకు మనం ఏం చేస్తున్నామో తెలియ చెప్పాలి.

గత ప్రభుత్వాలు ఏం తీసుకురాలేదు.. మన ప్రభుత్వం ఏం తీసుకువచ్చి చూపించిందో.. మనం వాళ్లకి తెలియ చెప్పాలి. గతంలో ఇవన్నీ జరగలేదు కదా.. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి. దీనివలన మన బ్రతుకులు ఎలా మారుతున్నాయి అని చెప్పడం కోసమే ఈ గడప గడప కార్యక్రమం అని.. ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు విడమరిచి వివరంగా చెప్పారు. అలాగే ఎమ్మెల్యే రోజా కొడాలి నాని కూడా గడపగడప కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.