Kodali Nani : తెలుగు రాజకీయాలలో కొడాలి నాని పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నాని ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిపోవడం జరిగింది. జగన్ జైల్లోకి వెళ్లాక టిడిపి నుండి మొట్టమొదటిగా వైసీపీలోకి వెళ్లిన నేత కొడాలి నాని. గుడివాడ అడ్డాగా కొడాలి నాని రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు సంచలనం రేపుతూనే ఉంటుంది. జగన్ కి నమ్మిన బంటుగా ముద్ర వేసుకున్న కొడాలి నాని.. ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో ఎప్పుడు దూకుడుగానే ఉంటారు.
ముఖ్యంగా మీడియా సమావేశాలు పెట్టి చంద్రబాబు, లోకేష్ నీ.. చెడుగుడు ఆడేసుకుంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చాక మరింతగా టీడీపీ నాయకులపై కొడాలి నాని దూకుడుగా వ్యవహరించడం జరిగింది. ఇటువంటి తరుణంలో కొడాలి నానిని 2024 ఎన్నికలలో ఓడించాలని టీడీపీ చాలా గట్టి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇందుకోసం ఇటీవల ఉమ్మడి కృష్ణాజిల్లా టిడిపి నేతలు ప్రత్యేకమైన సమావేశం నిర్వహించి ఎవరికి వారు కొడాలి నాని పై విమర్శలు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా సైతం తొడలు కొట్టి.. ఖచ్చితంగా 2024 ఎన్నికలలో కొడాలి నాని నీ ఓడిస్తామని శపథం చేశారు. అయితే అసలు కొడాలి నాని గుడివాడలో వరుసగా విజయం సాధించడానికి ప్రధాన కారణం టీడీపీ యే అని కొంతమంది తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. సరిగ్గా ఎన్నికలు వచ్చే సమయానికి జిల్లాలో కీలక టిడిపి నాయకులు ఎవరు కూడా కొడాలి నానికి.. సరెండర్ అయిపోతారని ఆరోపిస్తున్నారు.
గతంలో జిల్లాలో టీడీపి నాయకుల మధ్య విభేదాల వల్ల..వైసీపీ బాగా బలపడిందని అంటున్నారు. జిల్లాలో టీడీపీలో నాయకుల మధ్య విభేదాలు రావడానికి అతిపెద్ద కారణం ఒక మాజీ మంత్రి అని జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వీళ్లంతా కలిసి ఇటీవల సమావేశం నిర్వహించి కొడాలి నానిని వచ్చే ఎన్నికలలో ఓడిస్తామని చెప్పటం.. హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. సరిగ్గా ఎన్నికలు వచ్చే సమయానికి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా… కృష్ణాజిల్లా టిడిపి నాయకులు వ్యవహరిస్తారని చెబుతున్నారు. గుడివాడ లోనే తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమందికి కీలక నాయకులు ఎన్నికల సమయానికి కొడాలి నానికి లోపాయి కారిగా సహకరిస్తున్నారని అంటున్నారు. ఎన్నికల సమయంలో జిల్లా టీడీపీ ఐక్యంగా కలిసి పనిచేస్తే గాని కొడాలి నానినీ ఓడించలేరని లేకపోతే మళ్లీ 2024 ఎన్నికలలో సీన్ రిపీట్ అవుతుందని జిల్లా టీడీపీ కేడర్ అంటుంది.