Ys Jagan : జగన్ ఈ ఒక్కటీ చేస్తే.. నందమూరి ఓట్లు అన్నీ వైసీపీ కే !

Ys Jagan :  నందమూరి అభిమానుల ఓట్లను కొల్లగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటంటే ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇప్పించటం. ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశంపార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడల్లా తీర్మానాలు చేస్తునే ఉంటుంది. అదే అధికారంలో ఉంటేమాత్రం కనీసం ఒక్కమాట కూడా మాట్లడదు. దీంతోనే ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం వచ్చేట్లు చేయటంపై చంద్రబాబుకు ఎంత శ్రద్ధుందో అందరికీ అర్ధమైపోయింది.

కేంద్రంలో తాను చక్రంతిప్పానని చెప్పుకునే రోజుల్లో కూడా ఎన్టీయార్ కు భారతరత్న రాలేదంటు అందుకు చంద్రబాబు మాత్రమే కారణం. ఎన్టీయార్ కు అత్యున్నత పురస్కారం వచ్చేట్లు ప్రయత్నాలు చేయకపోతే బాగా అడ్డుకున్నారట. ఇపుడు ఆ పాయింట్ మీదే జగన్ వర్కవుట్ చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. హెల్త్ యూనివర్సిటీకి జగన్ ప్రభుత్వం ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు అండ్ కో ఓ రెండు రోజులు గోలచేసినా తర్వాత ఇపుడు చేయటంలేదు.

If Jagan does this, Nandamuri's votes will all go to YSP
If Jagan does this, Nandamuri’s votes will all go to YSP

పేరు మార్పు రాజకీయం ఎలాగున్నా టీడీపీని ప్రత్యేకించి చంద్రబాబును పూర్తిగా దెబ్బకొట్టాలంటే ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇప్పించటం ఒకటే మార్గమని జగన్ అనుకుంటున్నారట. ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి ప్రత్యేకంగా సిఫారసు చేసి ఎన్టీయార్ కు గనుక అత్యున్నత పురస్కారం ఇప్పించగలిగితే అప్పుడు జగన్ నిజంగానే హీరో అయిపోతారు.

ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇప్పించిన ఘనత జగన్ కే దక్కుతుంది. అదేగనుక జరిగితే నందమూరి అభిమానుల్లో అత్యధికులు జగన్ వైపు మొగ్గుచూపే అవకాశముంది. ఎన్నికల సమయానికి ఎన్టీయార్ కు వెన్నుపోటు పురాణమంతా మరోసారి చర్చకు వచ్చేట్లు వైసీపీయే చేస్తుంది. మొన్న పేరుమార్పు వ్యవహారమంతా సరిగ్గా వచ్చే ఎన్నికల్లో చర్చకు తీసుకొస్తుంది. అప్పుడు వైసీపీ వాదనను తిప్పికొట్టడానికి చంద్రబాబు అండ్ కో దగ్గర ఏమీ ఉండదు. మరి ఆపని జగన్ ఎప్పుడు చేస్తారనేది ఆసక్తిగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.