Rohini IAS :నీతిగా ఉండాలి.. న్యాయంగా ఉండాలి.. తర తమ భేదం లేకుండా వ్యవహరించాలి.. నియమ నిబంధనలకు తగ్గట్లే పని చేయాలనుకోవటానికి మించిన పెద్ద తలనొప్పి మరొకటి ఉండదు.. అంతే నిజాయితీగా వ్యవహరించే అధికారులు సహజంగానే మొండిగా ఉంటారు. ఎవరి మాట వినరు. ఇలాంటి వారు కష్టాల్ని పట్టించుకోరు. పోరాటాన్నే ఆయుధంగా చేసుకొని ముందుకెళుతుంటారు. కర్ణాటకలో అలాంటి పనే చేస్తున్నారు తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి..
కర్ణాటక మంత్రి మంజు తప్పుల్ని ఎత్తి చూపారు. బాహుబలి మహామస్తకాభిషేకాలు జరిగిన సందర్భంగా మంత్రి తీరుపై హసన్ జిల్లా కలెక్టర్ గా వ్యవహరిస్తున్న రోహిణి అసంతృప్తి వ్యక్తం చేయటం.. మంత్రి తప్పుల్ని ఎత్తి చూపటంతో వారి మధ్య అనుకోకుండా మాటల తూటాలు పేలాయి. మంత్రిని కదా అధికారం తో రోహిణిని కంట్రోల్ చేయాలనుకున్నప్పటికీ.. అలాంటి పప్పులు ఆమె దగ్గర ఉడకని వైనం. దాంతో రోహిణిపై ఏదో రకంగా పైచేయి సాధించాలని మంత్రి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వచ్చారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత బంజరు భూములకు సాగుపత్రాల్ని అందించిన తీరు పై ఎన్నికల కమిషన్ కు జిల్లా కలెక్టర్ హోదాలో ఉన్న రోహిణి లేఖ రాశారు. దాంతో మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దాన్ని తీసివేయడానికి మంత్రి రిక్వెస్ట్ చేశారు. దాంతో ఆమె సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి రోహిణికి ఎదురైంది.
ఎన్నికల అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బ తినేలా మంత్రి వ్యవహరిస్తున్నారని రోహిణి తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక మంత్రి చేసిన పనులను చూపించి.. నిబంధనల్ని ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారో చెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. ఎన్నికల వేళ ముక్కుసూటిగా వెళ్లే జిల్లా కలెక్టర్ తో పెట్టుకోవటానికి మించిన బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు. అలా రోహిణి తనకు అడ్డు వచ్చిన వారికి తొనకక బెనకక ముందుకు సాగుతుంది.