Chandrababu Naidu తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిన్న గుడివాడలో పర్యటించడం తెలిసిందే. ఈ పర్యటనకి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. చంద్రబాబు గుడివాడ నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చే సమయంలో భారీ గజమాలతో సత్కరించారు.

ఆయన రాకముందు గుడివాడ శరత్ సినిమా థియేటర్ వద్ద వైసీపీ…టీడీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో ఓ కుర్రోడు సీఎం వైఎస్ జగన్ ని అదే విధంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని తనదైన మాటలతో ఏకీపారేశారు. విశ్వాస ఘాతకానికి వెన్నుపోటుకి కొడాలి నాని నిర్వచనం అని మండిపడ్డారు. కొడాలి నానిని ఓడించడానికి తెలుగుదేశం పార్టీ సైనికులు సిద్ధంగా ఉన్నట్లు ఆ కుర్రోడు వీడియోలో తెలియజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బిక్షపెడితే కొడాలి నాని ఎమ్మెల్యే.. అయ్యారు. నందమూరి ఫ్యామిలీ బిక్షపెడితే కొడాలి నాని నిర్మాతగా సినిమా రంగంలో రాణించారు. అటువంటి వ్యక్తి ఈరోజు తల్లిపాలు తాగి రొమ్మును తన్నిన విధంగా.. తయారయ్యారు.
గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని గుడివాడకి ఎటువంటి అభివృద్ధి చేశాడో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసరడం జరిగింది. ఏది ఏమైనా గుడివాడలో కొడాలి నాని నీ ఓడించటానికి తెలుగుదేశం పార్టీ హై కమాండ్ పక్క వ్యూహాలతో సిద్ధంగా ఉంది. వచ్చే ఎన్నికలలో గుడివాడ నియోజకవర్గం నుండి నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ఓ ప్రముఖ వ్యక్తి పోటీ చేసే విధంగా… చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో కొడాలి నానిని ఇంటికి పంపించడానికి చంద్రబాబు చాలా ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.