AP HighCourt :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఎడాపెడా సలహాదారులను నియమించేస్తున్నారని విపక్షాలు ఎప్పటినుండో విమర్శలు చేస్తూన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సలహాదారుల వ్యవస్థపై ఏపీ హైకోర్టు గత కొద్ది నెలల నుండి వరుసగా మొట్టికాయలు వేస్తూ ఉండటం జరిగింది. ఈ పరిణామంతో జగన్ ప్రభుత్వం సలహాదారుల వ్యవస్థ విషయంలో కొత్త ఎత్తు వేసింది. దీని ప్రకారం ప్రభుత్వానికి కాకుండా మంత్రులకు సలహాదారులు ఉంటారని… హైకోర్టు తెలిపింది. శాఖలకు సలహాదారులు ఏంటని న్యాయస్థానం నిలదీయడంతో… సలహాదారుల హోదాని మరియు ప్రాధాన్యత పెంచుతూ చట్టబద్ధత కల్పించే వ్యూహం వైసీపీ సర్కార్ తాజాగా రచించినట్లు సమాచారం.

దీంతో వారిని పబ్లిక్ సర్వెంట్స్ గా పరిగణించినట్లు న్యాయస్థానికి తెలపడం జరిగింది. ప్రభుత్వానికి ఐఏఎస్ లు ఇతర కార్యనిర్వాహక వర్గం ఉన్నప్పటికీ… ఈ సలహాదారులు ఎందుకని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న రూల్స్ ప్రకారం…పబ్లిక్ సర్వెంట్ లుగా ప్రభుత్వ సలహాదారులను కొనసాగించే విధంగా జగన్ ప్రభుత్వం కొత్త విధివిధానం తీసుకురాబోతుందట. ఈ ప్రకారం రాజకీయ కార్యనిర్వహక స్థాయిలో విధానాలను రూపొందించనున్నారు. ఇప్పటిదాకా ప్రజలే అనుకున్న ప్రజా ప్రతినిధులు చట్టాలు రూపొందించడం జరిగింది. ఈ క్రమంలో బయట వ్యక్తులు సలహాలు ఇచ్చే రీతిలో జగన్ ప్రభుత్వం కొత్త విధివిధానం తీసుకురాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వంలో ఒక మంత్రి అంటే ఒక వ్యక్తి కాదు.
అదొక పెద్ద వ్యవస్థ. ప్రతి శాఖకు మంత్రి ఉంటారు. ఆ శాఖకు ప్రిన్సిపల్ సెక్రెటరీ… స్పెషల్ సెక్రటరీ హోదాలను సీనియర్ ఐఏఎస్ లు సారదులుగా నిర్వహిస్తారు. మంత్రి దగ్గర ఒక ఫైల్ పెట్టకు ముందు సంబంధిత సెక్రటరీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ రకంగా పటిష్టమైన వ్యవస్థ కలిగి ఉన్న సమయంలో బయట సలహాదారులు…జగన్ ప్రభుత్వం నియమించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఖాళీగా ఉన్న సినిమా నటీనటులకి ప్రభుత్వ సలహాదారుల పదవుల అప్పజెప్పి నెలకి జీతం లక్షల్లో ఇస్తూ వాళ్లకి ఆఫీస్ మరియు వాహనాన్ని కేటాయిస్తూ ఉంది. ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన చాలామంది అసలు ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారుల విషయంలో హైకోర్టు సీరియస్ అవుతూ ఉండటంతో జగన్ ప్రభుత్వం సరికొత్త విధానంతో ప్రభుత్వ సలహాదారులకు ప్రాధాన్యత కల్పించే దిశగా కొత్త ఆదేశాలు తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.