Modi-PawanKalyan : మోడీ తో భేటీ తర్వాత పవన్ ఇమేజ్ మరింత పెరిగిందా??

Modi-PawanKalyan :  నరేంద్ర మోడీ అత్యంత ప్రజాకర్షణ ఉన్న దేశ ప్రధాని అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. విశాఖ కు వచ్చిన ప్రధాని ది ఒక టైట్ షెడ్యూల్ ప్రోగ్రాం అనే చెప్పాలి. అందులోను అరగంట కు పైగా టూర్ ఆలస్యం కూడా అయింది. ఇలా జరిగినప్పుడు ముందుగా అనుకున్న కార్యక్రమాలు రద్దు చేయడమో లేక వాటి సమయాన్ని కుదించబడడమూ జరుగుతుంటుంది. కానీ నరేంద్ర మోడీ మాత్రం ముందుగా షెడ్యూల్ చేయబడిన కార్యక్రమాన్ని వాయిదా వేసి పవన్ కళ్యాణ్ కి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారి మీటింగ్ షెడ్యూల్ పది నిముషాలు అని ఉంటే దాన్ని అరగంటకు పెంచి మరి ఏకాంతం గా చర్చించారు. వారిద్దరి మధ్య మాత్రమే జరిగిన ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ఉంది.

Has Pawan's image increased after the meeting with Modi?
Has Pawan’s image increased after the meeting with Modi?

అంత ప్రాధాన్యత ఎందుకంటే ఒక ముఖ్య మంత్రి అక్కడే ఉన్నా కూడా, ఒక ఎమ్మెల్యే కూడా లేని పార్టీ అధినేతకు దేశం లోనే క్రేజ్ ఉన్న ప్రధాని తన కీలకమైన అపాయింట్‌మెంట్ ఇచ్చారు అంటే పవన్ ఇమేజ్ మరింత పెరిగినట్లే అని అంటున్నారు రాజకీయా విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి సీటు మీద గురి పెట్టి తనదైన వ్యూహాలు, ప్రణాళికల తో రాజకీయాలలో ముందుకు వెళ్తున్నారు. అయితే ఎనిమిదేళ్ళ తరువాత పవన్ కి ప్రధాని ఈ భేటీకి అవకాశంఇచ్చి అనేక విషయాలను చర్చించడం ద్వారా ఏపీ కి పవన్ కాబోయే ముఖ్య మంత్రి అన్న సంకేతాన్ని సందేశాన్ని ఏపీ జనాలకు అందేలా చేసారు అని అంటున్నారు.
అసలు మోడీ పవన్ ల మధ్య ఏమి జరిగింది అనే దాని కంటే పవన్ తో బీజేపీ కలసి ఏపీ రాజకీయాలు చేయబోతున్నారు అన్న బలమైన మెసేజ్ ని మాత్రం ఈ భేటీ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు రాజకీయ నిపుణులు. ఈ భేటీ ముగిసిన తరువాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి మంచి రోజులు వస్తున్నాయి అని అన్నారు. దీన్ని బట్టి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో అనేకమైన మార్పులు రాబోతున్నట్టుగా అర్ధం అవుతుంది. ఏపీకి మోడీ రావడం సంగతి ఎలా ఉన్న పవన్ మాత్రం టాక్ ఆఫ్ ది స్టేట్ గా నిలిచిపోయారు అని అంటున్నారు.