Nandamuri Suhasini : నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సునీత అందరికీ సుపరిచితురాలే. హరికృష్ణ చనిపోయిన తరువాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుండి కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా సునీత పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయినా గాని తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా రాణిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జిల్లాలో నందమూరి తారక రామారావు సొంత ఊరు నిమ్మకూరులో చంద్రబాబు పర్యటించడం తెలిసిందే.
ఈ పర్యటనలో నందమూరి సుహాసిని కూడా ఉండటంతో తన తండ్రి గురించి ఇంకా ఎన్టీఆర్ గొప్పతనం గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలుగువారు జీవితంలో మర్చిపోలేని గుర్తింపు ఇవ్వడంతో వారికి ఏదైనా చేయాలన్న తపనతో తాతగారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో తెలుగు వాళ్లకు గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు.
తెలుగు వారు అని పిలవబడక ముందు మద్రాసియులు అని అంటుండే వాళ్ళు. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి ఢిల్లీ పీఠాన్ని కదిలేలా చేసారు. రాష్ట్రంలో పేద ప్రజలకు కుడు, గూడు కల్పించే విధంగా పరిపాలన చేశారని పేర్కొన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి.. ఆస్తివాటా కూడా వాళ్లకి కలిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని సుహాసిని పేర్కొన్నారు. ఇంకా అదే విధంగా తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని చెప్పుకొచ్చారు. 2020 విజన్ పేరిట ఆనాడు హైదరాబాద్ నగరాన్ని చంద్రబాబు గారు అంతా అభివృద్ధి చేశారు. ఇప్పుడు 2050 విజన్ అని పెట్టుకుని మరింతగా ముందుకెళ్లటానికి ఆయన ప్రణాళికలు వేసుకున్నారు. ఈసారి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనందరికీ ఉండి అంటూ నందమూరి సుహాసిని సంచలన స్పీచ్ ఇవ్వడం జరిగింది.