AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం పాలన సాగుతుందని అన్నారు. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తున్నామని.. నవరత్నాలతో సంక్షేమ పాలన జరుగుదని తెలిపారు. డీబీటీ ద్వారా అవినీతి లేకుండా లబ్దిధారులకే సొమ్ము అందజేస్తున్నామని.. గ్రామ సచివాలయాలతో ప్రజల దగ్గరకే పాలన అందిస్తున్నామన్నారు.ఆర్థికాభివృద్ధిలో ఏపి ముందు ఉందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాలు అభివృద్ధి చెందుతున్నాయని.. 2020-21లో జీఎస్‌డీపీ వృద్ధి రేటులో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని గుర్తు చేశారు.

మొత్తంగా 11.43 శాతం అభివృద్ధి సాధించామని తెలిపారు. 45 నెలల్లో 1.97 లక్షల కోట్ల నగదు ప్రజలకి చేరిందన్నారు. లబ్ధిదారుల గుర్తింపు కోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు.సుదీర్ఘంగా సాగిన గవర్నర్ అనేక విషయాలపై మాట్లాడారు. ఏపీలో సంక్షేమ పథాకల వివరాల పైనే ఎక్కువగా మాట్లాడారు.అలాగే అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఏపీ గవర్నర్ పేర్కొన్నారు.కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిసారి గవర్నర్ ప్రసంగించారు. కాగా గవర్నర్ ఆయన ప్రసంగానికి సంబంధించిన పేపర్ ను చూస్తూ మాట్లాడారు తప్ప అందులో ఉన్న వాస్తవాల గురించి ప్రస్తావించలేదని టిడిపి నేతలు ఆయనను చూస్తూ ఆ ప్రసంగాన్ని వింటూ ఉండిపోయారు. మరి కొంతమంది లోలోపల నవ్వుకున్నారు కూడా.. ఏపీ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా మారుస్తుందో చూడాలి