Butchaiah Chowdary ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏడవ రోజు వైసీపీ మరియు టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడటం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో చాలా సందర్భాలలో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేయడం జరిగింది. కాగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వైసీపీ ప్రభుత్వంపై అసెంబ్లీలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు..ఉద్యమాలు చేస్తే గాని జీతాలు ఇవ్వటం లేదని మండిపడ్డారు.
అప్పట్లో ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేసారని మండిపడ్డారు. వాళ్లకి జీతాలు ఎప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితి. మళ్లీ రెండు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని తీసేస్తామని నోటీసులు ఇవ్వటం అన్యాయం. ఇదే సమయంలో రాష్ట్రంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు కానీ ఇతర బెనిఫిట్స్ లేకుండా చేశారని మండిపడ్డారు. వాళ్లకి హోసింగ్ మరియు పెన్షన్ చెందకుండా చేస్తున్నారని సీరియస్ అయ్యారు.
పారిశుధ్య కార్మికులకు సంబంధించి కుటుంబాలలో ముసలి వాళ్లకు పెన్షన్ లు కూడా రద్దు చేస్తున్నారు… ఇది అన్యాయం అని అన్నారు. అదేవిధంగా రేషన్ కార్డు కూడా రద్దు చేస్తున్నారని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు హౌసింగ్ పొందుకోలేకపోతున్నారు. మరోపక్క రేషన్ కూడా అందుకోలేకపోతున్నారు అంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. అమరావతి ప్రాంతంలో రైతు కూలీలకు వచ్చే డబ్బు కూడా వాళ్లకు రావడంలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దయచేసి పారిశుద్ధ్య కార్మికులకు నెలనెలా జీతం అందేలా చేయండి అని ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వేడుకున్నారు.
https://www.youtube.com/watch?v=DL6PB-9Xngk