Bhumi Reddy : పులివెందులలో ఎమ్మెల్సీగా గెలిచిన భూమిరెడ్డి మొదటి సంచలన ప్రెస్ మీట్..!!

Bhumi Reddy: ఇటీవల పట్టాభద్రా ఎమ్మెల్సీ ఎన్నికలలో సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి గెలవడం తెలిసిందే. అయితే ఆయన ఇటీవల మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల పులివెందులలో భారత్ యాదవ్ తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనపై భూమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఘటనలో జిల్లా యంత్రాంగం పోలీస్ వ్యవస్థ అనుసరిస్తున్న వైఖరి విస్మయానికి గురి చేస్తుందని అన్నారు. కడప జిల్లాలో పోలీస్ యంత్రాంగం వ్యవస్థలు..వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో దాదాపు.. 28 మంది వైసీపీ నాయకులకు లైసెన్స్ లు ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు.

దాదాపు కడప జిల్లా వ్యాప్తంగా 800 మందికి తుపాకీ లైసెన్సులు జారీ చేసినట్లు భూమిరెడ్డి లెక్కలు బయటపెట్టారు. ప్రాణహాని, వ్యాపారస్తుడు లేదా కాంట్రాక్టర్ కలిగిన వాళ్లకి తుపాకీ లైసెన్సులు ఇస్తారు. ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉన్న సమయంలో లైసెన్సులు జారీ చేస్తారు. ఒకవైపు పులివెందుల లో పోలీసు అధికారులు కేసులు ఉన్నవారికి లైసెన్స్ తుపాకులు ఇవ్వలేదని చెబుతారు. అయితే కడప జిల్లా పోలీస్ యంత్రాంగానికి సవాల్ విసురుతున్న. పులివెందుల నియోజకవర్గంలో తుపాకీ లైసెన్సులు ఇచ్చిన 180 మందిలో సగం మందికి పైగా పోలీస్ కేసులు కలిగిన వారే.

దోపిడీదారులకు, అక్రమాలకు పాల్పడిన వారు హత్యలు చేసిన వ్యక్తులకు గన్ మెన్ లు కల్పిస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. ఏ ప్రాతిపదిక లేకుండా వాళ్లకి గన్ మెన్ లు ఎలా కేటాయిస్తారు అని భూమిరెడ్డి నిలదీశారు. కడప జిల్లాలో పోలీసు యంత్రాంగం మొత్తం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దోపిడీలు అక్రమాలకు పాల్పడిన వైసీపీ పార్టీ వ్యక్తులకు… ప్రొటెక్షన్ కల్పిస్తూ ఆయుధాలకు లైసెన్స్ జారీ చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.