Shareef : మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మైనారిటీలకు ఎన్నో మంచి పనులు చేశారని చెప్పుకొచ్చారు. ముస్లింలను అమితంగా ప్రేమించిన నాయకుడని అభివర్ణించారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలలో పేదరికం ఉందని.. ఆయన ముఖ్యమంత్రి కాకముందే.. మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలకు ఆయన ఎన్నో ఆలోచనలు చేశారని చెప్పుకొచ్చారు. దాదాపు 35 సంవత్సరాలకు పైగా చంద్రబాబుని చూస్తూ ఉన్నాను.
ఆయన ముస్లిం కాకపోయినా గానీ మహమ్మద్ ప్రవక్త ఆచరించిన చాలా అలవాట్లు ఆయనలో కనిపించాయని షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినడంతోపాటు అవతాల వ్యక్తి.. మనసు గాయపరచకుండా వ్యవహరించాలని ప్రవక్త తెలియజేయడం జరిగింది. అదే వ్యక్తిత్వం చంద్రబాబులో కనిపించిందని తెలిపారు. పేరుకు ముస్లిం కాకపోయినా ఆచరణ పరంగా చంద్రబాబు ముస్లిం అని స్పష్టం చేశారు. ఎదుట వ్యక్తికి ఎప్పుడు హాని చేయాలని మనసు ఉండదు. సాధ్యమైనంత వరకు ఉపకారం చేయాలని ఆయన ఆలోచిస్తారు. అటువంటి నాయకుడిని పూర్తిగా మైనార్టీలు సమర్ధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ముస్లిం ఆచార వ్యవహారాలను ఆయన ఎంతగానో గౌరవిస్తారని తెలిపారు. భగవంతుడు సత్యం వైపు ఉండమన్నారు. మనందరం చంద్రబాబు వైపు ఆయన నాయకత్వాన్ని బలపరిచే విధంగా మద్దతు తెలపాలని కోరుతున్నట్లు మాజీ చైర్మన్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేస్తున్న ధర్మ యుద్ధంలో ముస్లింలంతా మద్దతు తెలిపి ఆయనను ముఖ్యమంత్రి చేయాల్సిందిగా కోరుతున్నానని పేర్కొన్నారు. ఆయన స్వచ్ఛమైన హిందువు అయినా గాని ముస్లింలను అమితంగా ప్రేమించిన నాయకుడు అని తెలిపారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు అండగా ఉండాలని షరీఫ్ వ్యాఖ్యానించారు.