Erram Naidu : డిక్లరేషన్ తర్వాత రాజకీయ పార్టీల్లో రకంపాలనాలు వచ్చాయి. వెన్నెముకలు వణుకు పుడుతుంది. మేము డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు వెనుకబడినటువంటి వర్గాల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. హనుమంతరావు గారు నెల్లూరులో సోనియా గాంధీకి 100 సీట్లు ఇమ్మని చెప్పి నేను చెప్పానని చెప్పి అతను మాట్లాడాడు. వైయస్సార్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లు కూడా సమావేశం పెట్టుకొని జిల్లాలో సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఆ దిశలో పయనిస్తున్నప్పుడు మీరు ఈ విధంగా ప్రలోభాలు పెట్టారు.
అంతేకాకుండా ప్యాకేజీలతో మొత్తం మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఈ మెసేజ్ ప్రజల్లోకి పోకుండా ఒక దుర్బుద్ధితో, ఒక కుట్రతో, మీరు చేస్తున్నటువంటి ఈ విధానానికి మేము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఏవండీ నాని గారికి పార్టీ ఏం తక్కువ చేసింది. 2004లో టికెట్ ఇచ్చాం. 2004లో చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 90 సంవత్సరాల ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు. రాజశేఖర్ రెడ్డి గారు దేవుడు 140 ఎకరాలు గుడివాడలో పేదల ఇళ్ల స్థలాలకి అవకాశం కల్పించిన టువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి.
అన్ని రకాలుగా పొగిడినటువంటి వ్యక్తి 2009లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఎందుకు తీసుకోవాలి. అని నేను అడుగుతున్నాను.? 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా..రెండోసారి పోటీ చేశారు కదా.. అయినప్పటికీ రాజశేఖర్ రెడ్డి దేవుడు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఎందుకు అవసరం వచ్చింది. అని అడుగుతున్న ఎర్రం నాయుడు. వెళ్లిన ప్రతి వాళ్లు కూడా మాట్లాడడం అలవాటైపోయింది. ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా..తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు అర్థం చేసుకోలేరా. అంత అమాయకుల. ఈ రాష్ట్రంలో ప్రజలు చైతన్యం లేని వారని చెప్పి మనం ఏది మాట్లాడినా అడ్డగోలుగా ప్రజలు విశ్వసిస్తారని మీరు అనుకుంటున్నారా.చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు కి వెన్నుపోటు పొడుస్తే 2004లో టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది. అయితే ప్రస్తుతం పార్టీ నాయకులు అందరూ కూడా ప్యాకేజీలకు ఆకర్షితులై పార్టీలు మార్చడం ఎక్కువైపోయింది.