NTR : రాజకీయమంతా ఎన్టీయార్ చుట్టూనే తిరుగుతోందా ?

NTR :  ఏపీ రాజకీయాలు చిత్ర విచిత్రంగా తిరుగుతున్నాయి. ఎక్కడో స్విచ్చేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగినట్లని చెబుతుంటారు కదా అలాగే ఉంది వ్యవహారమంతా. అసలు వివాదమేమో హెల్త్ యూనివర్సిటికీ ఎన్టీయార్ పేరుతీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం. దానిమీద మొదటిరోజు వైసీపీ-టీడీపీ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్రస్ధాయిలో జరిగాయి. అయితే రెండురోజులు గడిచేటప్పటికీ విషయం పూర్తిగా పక్కదారి పట్టేసింది.

Advertisement

ఇపుడు జరుగుతున్న గొడవంతా జూనియర్ ఎన్టీయార్ మీదే. టీడీపీ నేతలు అనుకున్నట్లుగా తన ట్వీట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అమ్మనాబూతులు తిట్టలేదు. పైగా ఎన్టీయార్, వైఎస్సార్ ఇద్దరూ ప్రజాభిమానం ఉన్న గొప్పనేతలే అని కితాబిచ్చారు. హెల్త్ యూనివర్సిటీకి ఎవరిపేరున్నదనే విషయం అసలు సమస్యే కాదన్నట్లుగా ట్వీట్లో ఉంది. దాంతో తమ్ముళ్ళందరికీ ఒళ్ళుమండిపోయి జూనియర్ ను ర్యాగింగ్ మొదలుపెట్టారు. దీనిపై జూనియర్ అభిమానసంఘాలు తమ్ముళ్ళపై రివర్సు మొదలుపెట్టారు.

Advertisement
Does all politics revolve around NTR
Does all politics revolve around NTR

ఇక్కడ తమ్ముళ్ళ బాధేమిటంటే అసలు జూనియర్ తెలుగుదేశంపార్టీ మనిషేనా కాదా అని నిర్ధారణ చేసుకోవాలని అనుకుంటున్నట్లున్నారు. ఎన్టీయార్ ఫ్యామిలీకి మద్దతుగా నిలబడతారా లేదా అన్న విషయాన్ని తేల్చుకోవాలని అనుకున్నట్లున్నారు. ఈ రెండింటి క్లారిటి కోసమే జూనియర్ ను తమ్ముళ్ళు ర్యాగింగ్ మొదలుపెట్టారు. అయితే ఈ రెండింటికి జూనియర్ తరపున క్లారిటి రాలేదు. ఎందుకంటే చంద్రబాబునాయుడు, లోకేష్ ఉన్నంతవరకు టీడీపీ రాజకీయాల్లో జూనియర్ భాగస్వామి కాదలచుకోలేదన్నది స్పష్టం.

జూనియర్ టీడీపీ మనిషేనా లేకపోతే నందమూరి ఫ్యామిలీని ఓన్ చేసుకుంటారా లేదా అన్నది ఫ్యామిలీ సభ్యుల మీదే ఉంటుంది. టీడీపీ మనిషేనా, నందమూరి ఫ్యామిలీని ఓన్ చేసుకుంటారా లేదా అనే విషయంలో కొత్తగా జూనియర్ శీలపరీక్షకు నిలవాల్సిన అవసరమే లేదు. జూనియర్ ను దూరంపెట్టింది నందమూరి ఫ్యామిలీయే అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి తమ్ముళ్ళకు కావాల్సిన క్లారిటి జూనియర్ నుండి ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదు. ఈ రాజకీయ వివాదం నడిచినంత కాలం రాజకీయమంతా జూనియర్ చుట్టూనే తిరుగుతోంది. ఎంతకాలం తిరుగుతుందంటే అది తమ్ముళ్ళపైన ఆధారపడుంది.

Advertisement