Deputy CM : డిప్యూటీ సీఎం నారాయణస్వామి ని మీరు మంత్రేనా అని ప్రశ్నించిన మహిళ..

Deputy CM : సీఎం నారాయణస్వామి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. దర్శనం తరువాత ఆలయంలో నుంచి బయటకు వస్తున్నారు. ఆయన బయటకు వస్తున్న సమయంలో ఓ వింత సంఘటన ఎదురైంది. ఆయనను చూసి ఓ మహిళ తిరుమలలో జరుగుతున్న సమస్యలను చెప్పారు..

తిరుమలలో మంత్రి నారాయణస్వామితో ఓ మహిళా భక్తురాలు.. స్వామి మీరు ఎవరు నాకు తెలియదు.. మీరు మంత్రి పదవి లో ఉన్నారా అని అడుగుతుంది. అందుకు నారాయణస్వామి తలుపుతూ అవును అన్నట్లుగా చెబుతారు. ఆ పక్కనే ఉన్న ఆయన పీఏ వెంటనే ఆయన మంత్రి మీ సమస్య ఏంటో చెప్పండి అని చెబుతాడు. తిరుమలలో గదుల కేటాయింపు వద్ద, క్యూలైన్స్, కొన్నిచోట్ల మురుగు వాసన వస్తుంది.కొంచెం పట్టించుకోండి సార్ అంటూ ఆ మహిళా భక్తురాలు తన సమస్యను చెప్పుకున్నా రు.

అసలు అక్కడ నీట్ నెస్ ఉందా అని ప్రశ్నించారు. మంత్రి నేను చెబుతాను అంటూ దండం పెట్టి వెళ్ళిపోతున్న సరే ఆ మహిళ తన బాధను వివరిస్తూనే ఉన్నారు. ఈవో కు ఫోన్ చేస్తే కలవడం లేదని సదరు మహిళా భక్తురాలు తెలిపింది. డైల్ యువర్ ఈవో కు ఫోన్ చేస్తే కలవడం లేదని చెప్పింది. ఈ సమస్యను పై అధికారులకు చెబుతాను అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అక్కడ నుంచి ముందుకు కదిలారు. మరొక భక్తుడు వచ్చి సెల్ఫీ కోరడంతో నారాయణస్వామి ఓపికగా సెల్ఫీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మహిళా భక్తురాలు నారాయణస్వామిని ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.