Ys Bharathi : ఇటీవల 132వ అంబేద్కర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహం ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఇద్దరు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే రోజు సాక్షి ఛానల్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కొన్ని కథనాలు ప్రసారం చేయడం జరిగింది. దేశం కోసం దళితులు చేసింది ఏమీ లేదు అన్నట్టు వార్తలు ప్రసారం చేసినట్లు.. దళితుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినట్లు టీడీపీ నేతలు మంగళగిరిలో పోలీస్ కేసు పెట్టారు. సాక్షి ఛానల్ యాజమాన్యం వైఎస్ జగన్ భార్య భారతి పై.. ఫిర్యాదు చేయడం జరిగింది.

అంబేద్కర్ జయంతి నాడు లోకేష్ పై దళితుల విషయంలో దళిత వర్గాలను తెలుగుదేశం పార్టీకి దూరం చేసే విధంగా సాక్షి మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా.. దుష్ప్రచారం చేసినట్లు పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక్క లోకేష్ పై మాత్రమే కాకుండా ఆరోజు చంద్రబాబుపై కూడా దళితుల విషయంలో గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలను బాగా ప్రసారం చేయడం జరిగింది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు ఎవరైతే దళితులపై విమర్శలు చేయడం జరిగిందో వారందరి వీడియోలను కూడా ప్రచారం చేయడం జరిగింది.
ఒక విధంగా తెలుగుదేశం పార్టీపై దళితులకు వ్యతిరేకత వచ్చే విధంగా సాక్షి మీడియా అతిగా వ్యవహరించినట్లు మంగళగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. దళితుల ఓట్లు అడ్డం పెట్టుకునే అధికారంలోకి వచ్చిన జగన్… నాలుగు సంవత్సరాలలో దళితులకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. పైగా దళితులకు ఉండాల్సిన పథకాలను మొత్తం వైసీపీ ప్రభుత్వం కట్ చేసి పడేసిందని విమర్శించరు. సాక్షి మీడియాతో పాటు వైసిపి సోషల్ మీడియా మార్ఫింగ్ వీడియోలు… ఫోటోలతో ఇష్టానుసారంగా ప్రసారం చేశారని విమర్శించారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ దళితులకు న్యాయం చేస్తామని..టీడీపీ నేతలు స్పష్టం చేశారు.