మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..! 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేశారు.. ప్రతి పథకానికి మహిళలకే లబ్ధి చేకూరేలాగా చేస్తున్నారు.. ఎన్నడు లేనివిధంగా వైయస్సార్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టి 45 సంవత్సరాల మహిళలకు అండగా నిలుస్తున్నారు.. వైయస్సార్ చేయూత పథకానికి అర్హులైన వారిని దరఖాస్తులు చేసుకోమని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.. తాజాగా ఈ పథకం యొక్క గడువు తేదీని మరోసారి పొడిగించండి..

CM Jagan good news for women
CM Jagan good news for women

ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ సామాజిక వర్గాల్లోని 45 నుంచి 60 మధ్య వయసున్న మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం వర్తిస్తుంది.. ఈ పథకం కింద ప్రభుత్వం సంవత్సరానికి రూ. 18,750 చొప్పున.. నాలుగు విడతల్లో మొత్తం 75 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.. ఇప్పటికే రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా మహిళలకు సుమారు 10 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది..

ఈ నెల 22వ తేదీన వైఎస్ఆర్ చేయూత మూడో విడత ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.. కొత్తగా అర్హత పొందిన వారి నుంచి ఈ నెల 5 వరకు దరఖాస్తులు స్వీకరించాలని గడువు తేదీని ప్రకటించింది.. కాదా మరలా ఈ డేట్ ను ఎక్స్టెండ్ చేస్తూ ఏడో తేదీ వరకు పొడిగించారు. తాజాగా ఆ గడువు తేదీని మళ్లీ ప్రభుత్వం పొడిగించింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న మహిళలకు ఇదొక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు..