YS Jagan : సీఎం జగన్ తిరుపతి వెళితే ఏం చేస్తారో తెలుసా.. 

YS Jagan :ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే పలు మార్లు తిరుపతి దేవస్థానం కి వెళ్లారు. శ్రీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అయితే జగన్ తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు ఆయన బందో బస్తు ఎలా ఉంటుంది.. ఆయన పద్మావతి నిలయం దిగి ఎలా బందో బస్తు చేశారో దానికి సంబంధించిన ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఇక జగన్ వాలంటీర్ కి తీపి కబురు అందిచారు. సీఎం ఆదేశాల మేరకు అమరావతి గ్రామాల వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. అమరావతిలో భూమిలేని నిరుపేదలకు ఇచ్చే నెలవారీ రూ.2500/- పెన్షన్‌‌ను.. భూమిలేని అమరావతి గ్రామాల వాలంటీర్లను కూడా అర్హులుగా ప్రకటించారు. మార్చి 1 నుంచి పెన్షన్ అమలు చేయనున్నారు. సుమారు 200 మంది అమరావతి గ్రామాల వాలంటీర్లకు ఈ పింఛన్ మంజూరు చేస్తారు. ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్.వై శ్రీలక్ష్మి తెలిపారు.

ఇటీవల అమరావతి గ్రామాలలో పర్యటనలో ఉన్న సమయంలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వాలంటీర్లు ఈ విషయాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్.వై శ్రీలక్ష్మికి తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం జగన్‌కు ఈ సమస్యను వివరించగా సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారి కుటుంబాలకు పింఛన్లు అందించాలని ఆదేశించారు. వీరిని ఉద్యోగులుగా పరిగణించి.. ప్రతి నెలా భూమి లేని నిరుపేద గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు పింఛ‌ను రూ.2,500 మంజూరు ఇస్తారు. ఈ నిర్ణయంపై వాలంటీర్లు హర్షం వ్యక్తం చేశారు.. తమ సమస్యను పరిష్కరించిన సీఎం జగన్‌ కు ధన్యవాదాలు చెప్పారు.