Jagan Selfie Challange : నిన్న ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈబీసీ పథకం కార్యక్రమంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇటీవల లోకేష్ మరియు చంద్రబాబు పలు సందర్భాలలో సెల్ఫీ చాలెంజ్ లు చేయటం జరిగింది. దానికి కౌంటర్ గా రాష్ట్రంలో ఏదైనా పేద వాడి ఇంటికి వెళ్లి నేను ఈ మంచి పని చేశాను అని నువ్వు చెప్పుకునే సెల్ఫీ ఏదైనా ఉందా అంటూ చంద్రబాబు ఉద్దేశించి జగన్ సవాల్ విసిరారు. ఈ సవాల్ పై చంద్రబాబు నిన్న విజయవాడలో నిర్వహించిన ఇదేం కర్మ కార్యక్రమంలో ప్రతిస్పందించారు. మేటర్ లోకి వెళ్తే ఓ ముస్లిం కుటుంబంలో అంగవైకల్యం కలిగిన ఓ అమ్మాయి దాదాపు కొన్ని సంవత్సరాలు నుండి మంచానికి పరిమితమైన పరిస్థితి. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ హయాంలో పెన్షన్ వచ్చేది.

కానీ ఇటీవల జగన్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని ఆమెకు రావలసిన పెన్షన్ కట్ చేయడంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఆధారం లేక జీవచ్ఛవంలా ఇటువంటి అభాగ్యురాలుపై ఈ రకంగా వ్యవహరించటం అన్యాయమని.. అందుకే ఈ ఇదేం కర్మ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే సమయంలో సదరు ముస్లిం కుటుంబాన్ని వేదికపై తీసుకొచ్చి వాళ్లకి… 36 వేల రూపాయల చెక్కు చంద్రబాబు అందజేయడం జరిగింది.
ఈ ప్రభుత్వం అన్యాయం చేసిన గాని తెలుగుదేశం ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని ధైర్యంగా ఉండాలని ఆ కుటుంబానికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆ పాపను చూసి చలించి పోయిన చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్ చేసావు కదా జగన్ చూసుకో ఇది నువ్వు.. చేసిన అన్యాయమని.. సెల్ఫీ దిగటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై మానవత్వం ఉంటే సమాధానం చెప్పు. మనిషివైతే సమాధానం చెప్పు. ప్రశ్నించినప్పుడు ఎదురు దాడి చేయడం కంటే సమస్యల పరిష్కారం కోసం… ఎవరు చెప్పినా విని సమస్యలు పరిష్కారం చేస్తే.. నీకు కాస్తో కూస్తో మర్యాద ఉంటుంది… లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావ్.. అంటూ చంద్రబాబు మండిపడ్డారు.