Chandrababu Naidu : మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినందుకే టీడీపీ నేతలు పొంగిపోతున్నారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. చంద్రబాబు హడావుడి చూస్తుంటే నవ్వొస్తోందని.. గవర్నర్ ను కలవడం ఒక్కటే తక్కువ అని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు టిడిపి అధినేత చంద్రబాబు తిప్పికొట్టే విధంగా మాట్లాడారు.. ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్పారు అయినా మీకు బుద్ధి రావడం లేదా అంటూ ఎద్దేవా చేశారు. మీలాంటి వాళ్ళ మాటలను నేను అస్సలు పట్టించుకోను. ముఖ్యమంత్రిగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల తీరు సరికాదని సజ్జల ఆక్షేపించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కొందరు అధికారుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఒక్క బండిల్ చూస్తేనే ఆరు ఓట్లు తేడాగా కనిపించాయని, అన్ని బండిల్స్ పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని అన్నారు. వైసీపీ ఓట్లను టీడీపీ ఓట్లలో కలిపేశారని, రీకౌంటింగ్ కోరడం అభ్యర్థి హక్కు అని స్పష్టం చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్తేంకాదని సజ్జల విమర్శించారు. అర్జంటుగా అధికారంలోకి వచ్చేయాలని చంద్రబాబు తహతహలాడుతున్నారని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు మీ వైసీపీ ప్రభుత్వానికి బుద్దోచ్చేలాగా గుణపాఠం చెప్పారు ఇప్పుడు అందరూ వై ఛీ పో అని అంటున్నా రు. వైయస్సార్ చి పో అని అంటున్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీ అంతటికి మీరే స్వతంత్రంగా ఎన్నికలకు వస్తే మంచిది అంటూ చంద్రబాబు అన్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70 శాతం ఓట్లు పోలింగ్ అవ్వడం ఇదే మొదటిసారి. చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. వైసీపీకి డేంజర్ బేల్స్ మోగుతున్నాయని చంద్రబాబు అన్నారు.
https://www.youtube.com/watch?v=ixWXrjRkeKU