MLC Elections : పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అనూహ్యంగా పుంజుకోవటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. 2019 ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో జరిగిన చాలా ఎన్నికలలో వైసీపీ తిరుగులేని విజయాలు సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికలలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ జెండా ఎగిరింది. దీంతో ఏపీలో వైసీపీ పార్టీకి తిరుగులేదు అనే ప్రచారం స్టార్ట్ అయింది. అదే సమయంలో జగన్ పార్టీ నాయకుల సమావేశాలలో 175 కి 175 అనే టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఇటీవల జరిగిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమలో టీడీపీ అభ్యర్థులు గెలవడం జరిగింది
వైసీపీ బలంగా ఉండే చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఫలితాలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధినాయకులు ఫుల్ సంతోషంగా ఉన్నారు. ప్రజలలో మార్పు స్టార్ట్ అయిందని ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు… వైయస్ జగన్ కి ఊహించని కౌంటర్ ఇచ్చారు. తన పొలిటికల్ కెరియర్ లో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో… ఈ రకమైన ఓటింగ్ శాతం ఎప్పుడు చూడలేదని చెప్పుకొచ్చారు.
పైసా ఖర్చు చేయలేదు. అయినా గాని స్వచ్ఛందంగా ఓటర్స్ వచ్చి ఈ రీతిగా తీర్పు ఇవ్వటం.. ఫలితాలు రాబట్టడం నిజంగా సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. కొన్ని వర్గాలకు మంచి చేయలేకపోవడం వల్లే ఈ ఫలితాలు వచ్చినట్లు వైసిపి ఒప్పుకుంది. మంచి చేసిన గాని.. వైసీపీకి ఈ రీతిగానే తీర్పు ఇవ్వటానికి ప్రజలు రెడీగా ఉన్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇచ్చేది పది రూపాయలు లాక్కునేది వంద రూపాయలు. ప్రజలకి కూడా మీ స్కీం అర్థం అయిపోయింది అంటూ చంద్రబాబు ఇచ్చిన కౌంటర్ వీడియో కింద ఉంది అందరి వీక్షించండి.