Mahasena Rajesh: కేంద్ర అధికార పార్టీగా ఉన్న బిజెపి రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలో లేకపోయినా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధికారంలో ఉన్న వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలను తమ గుప్పెట్లో పెట్టుకునే వ్యూహానికి తెరతీసింది. అన్ని విషయములోనూ కేంద్రంతో ఈ రెండు పార్టీలు సఖ్యత గానే ఉంటున్నాయి. ఏపీ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. కేవలం రాష్ట్ర బిజెపి నాయకులు వరకు ఆ విమర్శలను తిప్పుకొడుతూ ప్రతి విమర్శలు చేస్తున్నారు.

కానీ కేంద్రంలో ఉన్న బిజెపి పెద్దలను విమర్శించేందుకు ఏమాత్రం సాహసించడం లేదు. అంతేకాకుండా కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైసిపి ఎంపీలు మద్దతు పలుకుతూనే వస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదట్లో బిజీ ఏపీకి సుముఖత గానే ఉన్నా గాని నిదానంగా ఆయన కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. కెసిఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం బిజెపిపై విమర్శలు చేయడం జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారం లో లేకపోయినా కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు కేంద్ర బిజెపి పెద్దలు ప్రతి విషయంలోనూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే సిబిఐ కేంద్రం రంగంలోకి దించి రెండు రాష్ట్రాలలోని అధికార పార్టీలను ఇరుకుల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కేసీఆర్ కూతురు కవిత ఈడి విచారణ జరుగుతుంది .ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉంది . మరోవైపు వైసీపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆయన కుమారుడు రాఘవ పేరును కూడా ఈ కేసులో చేర్చారు. త్వరలోనే ఆయనను కూడా అరెస్టు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు మాజీ మంత్రి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులను సిబిఐ అధికారులు దూకుడు వ్యవహరిస్తున్నారు. జగన్ ను ఇరుకున పెట్టాలని కేంద్రం గట్టిగానే ఆలోచిస్తున్నట్లు సమాచారం.. కేంద్రం మాట వినకపోతే జగన్ కి చుక్కలు చూపించేందుకు ప్లాన్ కూడా వేసినట్లు తెలుస్తోంది.
https://www.youtube.com/watch?v=cfatl_ESfPc