YS Jagan : 2024 ఎన్నికల దృష్ట్యా మళ్ళి జగన్ పాదయాత్ర చేస్తారు అని ఒక వార్త అయితే ఉంది. కానీ ఇంకో పక్క జగన్ జనంలోకి ఎప్పుడు వస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తానని చెప్పే జగన్ సీఎం అయి మూడున్నరేళ్లు కావస్తున్నా ఇంతవరకు ప్రజల్లోకి రావడం అనేది జరగలేదు. ఈ మధ్య కాలంలో వివిధ పథకాల దృష్ట్యా మీటింగ్ లకు వెళ్తున్నప్పటికీ ప్రజలలో దాని ప్రభావం పెద్దగా కనబడటం లేదు.అందుకే జగన్ ఇప్పుడు రచ్చబండ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు అని ఇందులో భాగం గా ప్రజల ను కలసి వారి సమస్యలు తెలుసుకుంటారని కొన్నాళ్లుగా తాడేపల్లి వర్గాల మధ్య చర్చ నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎవరూ నోరు మెదపకపోవడం తో ఇక రచ్చబండ కార్యక్రమం ఇకలేనట్టేనని,ప్రజల మధ్యకు వచ్చే అవకాశం కూడా లేదని చెబుతున్నారు.

జగన్ ఈ మధ్య ఒక వినూత్న కార్యక్రమాన్ని చేయనున్నట్టు తెలియచేసారు. ఆ కార్యక్రమమే “జగనన్నతో చెబుదాం!”. అసలు ఈ నెల 2వ తేదీనే ఈ కార్యక్రమం మొదలు కావలి అని అనుకున్నారు కానీ కొన్ని కారణాలతో మొదలు పెట్టలేకపోయారట. కానీ ఈ కార్యక్రమం అనేది త్వరలోనే కచ్చితం గా జరుగుతుంది అని సీఎం అన్నట్టుగా పార్టీలో చర్చ అయితే నడుస్తుంది. ఈ కార్యక్రమం లో జగన్ స్వయంగా ప్రజల నుంచి నేరుగా సమస్యలు వినడం జరుగుతుంది అని అంటున్నారు.
అయితే ఇది ఎంతవరకు జగన్ కి , పార్టీకి మేలు చేస్తుందనేది అనేది మాత్రం తెలియలిసి వుంది. ప్రజలు ఫోన్లు చెప్పుకున్న సమస్యలు ఎంతవరకు తీరతాయి అనేది సందేహం గా నే ఉంది. అంతే కాదు ఫోన్లలో ప్రజలు ఏ సమస్య చెప్పుకోవాలన్న ఇబ్బంది పడతారనే వాదన కూడా తెరమీదకు వస్తుంది. ఎందుకంటే ఫోన్ చేసినప్పుడు కాల్ రికార్డు చేస్తారు దానికి తోడు అప్పుడు తమ పేర్లు వివరాలు కూడా తెలియచేయాల్సి ఉండటం వలన తమకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు అయినా రావచ్చు అని ప్రజలు అంటున్నారు . మరి వైసీపీ దీనిమీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.