janasena: రెండుమూడు రోజులనుండి ఎల్లోమీడియాలో వస్తున్న వార్తలు, కథనాలు చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. పేరుకు మిత్రపక్షాలే కానీ జనసేన-బీజేపీ మధ్య పెద్దగా సఖ్యత లేదు. గడచిన మూడేళ్ళల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండుపార్టీలు కలిసి కనీసం రెండు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించలేదు. పైగా రెండుపార్టీల్లోను పొత్తు వద్దనే అభిప్రాయం బలంగా ఉంది. కాకపోతే ఎన్నికలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇప్పటినుండి ఎందుకులే అని బయటకు ప్రకటించటంలేదంతే.
ఇక ప్రస్తుతవిషయానికి వస్తే ఈమధ్యనే రాష్ట్రపతి భవన్లో జరిగిన ఆజాదీకి అమృతోత్సవ్ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అద్యక్షత వహిస్తే నరేంద్రమోడీ కూడా పాల్గొన్నారు. దేశంలోని అందరు ముఖ్యమంత్రులతో పాటు ప్రతిపక్ష నేతలను కూడా కేంద్రప్రభుత్వం ఆహ్వానించింది. సమావేశమైపోయిన తర్వాత మోడీ చాలామంది నేతలతో మాట్లాడారు. ఇందులో భాగంగానే చంద్రబాబుతో కూడా మాట్లాడారు. దీంతో ఎల్లోమీడియా, టీడీపీ ఒకటే ఊకదంపుడు మొదలుపెట్టింది.
చంద్రబాబుతో మోడీ మాట్లాడుతు మీతో చాలా మాట్లాడాలని అన్నారట. ఢిల్లీకి ఎందుకు రావటంలేదని అడిగారట. రెగ్యులర్ గా ఢిల్లీకి వస్తూండండన్నారట. ఢిల్లీకూడా మీ ఇల్లే అనుకోండని చెప్పారట. టటట ఇవన్నీ అటలే. మోడీ-చంద్రబాబు మధ్య కాసేపు జరిగిన సంభాషణను మీడియాకు ఎవరు చెప్పాలి. మోడీ అయితే చెప్పరు కాబట్టి చంద్రబాబే చెప్పుండాలి. తనగురించి చెప్పుకునేటప్పుడు చంద్రబాబు చాలా ఎక్కువచేసి చెప్పుకోవటం అలవాటే. కాబట్టే ఇపుడు కూడా అలాగే చెప్పుకునుంటారు. దీంతో ఎల్లోమీడియా ఎలా కలరింగ్ ఇస్తోందంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ+టీడీపీ పొత్తుఖాయమన్నంతగా కలరింగ్ ఇస్తోంది.
ఎలాగూ జనసేనతో కలిసివెళ్ళటం బీజేపీకి ఇష్టంలేదు. ఇదే సమయంలో జనసేనతో పొత్తువద్దని టీడీపీ నేతలు చంద్రబాబుపై బాగా ఒత్తిడి తెస్తున్నారు. అంటే ఇటు జనసేనను బీజేపీ దూరంపెట్టేసి అటు టీడీపీ కూడా దూరంపెట్టేస్తే ? మిగిలిన రెండు పార్టీలు టీడీపీ-బీజేపీలు పొత్తు పెట్టేసుకుంటే సరిపోతుందన్నట్లుగా లెక్కలేసుకుంటున్నారు. ఈ రెండుపార్టీల్లో బీజేపీకి ఉన్న బలమేంటో అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో జనసేనను దూరంపెట్టేసి బీజేపీ+టీడీపీ కలిస్తే ఏమి జరుగుతుందనేది ఎన్నికల్లో మాత్రమే తెలుస్తుంది.
టీడీపీ నేతల ఆలోచనలు, ఎల్లోమీడియా రాతలు చూస్తుంటే పై రెండుపార్టీలతో జనసేనను దూరంపెట్టించేట్లే అనుమానంగా ఉంది. ఒకవేళ అదేగనుక జరిగితే అప్పుడు కానీ టీడీపీకి తలబొప్పికట్టదు. బీజేపీకి కొత్తగా పోయేదేమీలేదు. ఎందుకంటే ఇఫుడున్నదే గోచి కాబట్టి అది ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. నష్టమంటు ఏమైనా జరిగితే అది టీడీపీకి మాత్రమే. ఆ నష్టంకూడా రైట్ టైమ్ లో తీసుకునే రాంగ్ డెసిషన్ వల్లే అవుతుందనటంలో సందేహంలేదు. మొత్తానికి ఎల్లోమీడియా మళ్ళీ మళ్ళీ చంద్రబాబును తప్పుదోవపట్టిస్తున్నట్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చూడాలి చివరకు ఏమి జరుగుతుందో.