Buddha venkanna : వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల ఓడిపోవడం ఖాయమన్న బుద్ధ వెంకన్న..

Budda venkanna counter to cm jagan : ఉత్తరాంధ్ర టిడిపి ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న 2024లో పులివెందులలో జగన్ ను ఓడిస్తామని అన్నారు. టిడిపి బలపరచిన పట్టభద్రుల ఎంఎల్సీలు గెలవడంతో బెజవాడలో సంబరాలు చేసుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో బుద్ధ వెంకన్న మీడియాతో మాట్లాడారు. మళ్ళీ వచ్చేది చంద్రబాబు నాయుడేనని… నాని, వంశీ, అవినాష్ టిడిపి భిక్షతో వచ్చిన వాళ్ళు అని విమర్శలు చేశారు. ఇక పనిలో పనిగా జగన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు..

Advertisement

TDP leader Buddha Venkanna arrested for comments on Kodali Nani, DGP

Advertisement

ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో జరిగిన పట్టభద్రుల MLC లో టిడిపి అభ్యర్ధులను గెలిపించారని.. ప్రజల తీర్పుకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. 2024లో వచ్చేది చంద్రబాబే అని దేవుడు స్క్రిప్ట్ రాసాడని.. 14 నెలల ముందే దేవుడు తీర్పు చెప్పారని అన్నారు.. కుప్పంలో చెత్తకుప్పని కూడా కొట్టలేరు.. పులివెందుల కొట్టేసాం.. 2024లో జగన్ పులివెందుల లో గెలిస్తే చాలు అని హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని జగన్ కు సవాల్‌ విసిరారు బుద్ధ వెంకన్న.

సొంత బాబాయిని చంపి ఆ సానుభూతి ఓట్లతో.. గత ఎలక్షన్లలో గెలిచారని ఇప్పుడు ఓడిపోకుండా ఉండటానికి అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన అన్నారు. నువ్వు నిజంగా ప్రజలకు మంచి చేయాలని అనుకుంటే.. ఈ ఎలక్షన్లలో నీకు అసలైన తీర్పు వచ్చి ఉండేదని ఇప్పటివరకు నీ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో ప్రజలకు ఎంత ఇబ్బంది కలిగిందో.. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తేలిపోయిందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో నువ్వు పులివెందులలో పోటీ చేసి గెలిస్తే చాలని ఆయన సవాల్ విసిరారు. పూర్తి వివరాల కోసం ఈ కింద వీడియో చూడండి.

Advertisement