TDP -YCP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారీపోయాయి. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అదేవిధంగా నిన్న జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ ఒక్కసారిగా పుంజుకోవటం జరిగింది. వైసీపీ నుండి క్రాస్ ఓటింగ్ ద్వారా టీడీపీకి నాలుగు ఓట్లు పడటంతో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఘనవిజయం సాధించింది. ఇదిలావుండగా అంతకుముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం సమయంలో గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కి లెటర్ రాయడం తెలిసిందే. దీంతో నిన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాన్ని స్పీకర్ ఆమోదించినట్లు…ఆయన ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేనట్లు ప్రచారం జరిగింది.
కానీ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత 23 ఓట్లతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో టీడీపీ క్యాడర్ ఫుల్ సంతోషంగా ఉంది. గంటా శ్రీనివాసరావు సైతం చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఈ విజయంతో గంటా శ్రీనివాసరావు సన్నిహితులు ఎవరైతే టీడీపీ తరపున గెలిచి వైసీపీలోకి వెళ్లారో .. వారిని బ్యాక్ టు టీడీపీకి తీసుకురావడానికి..తెర వెనకాల రాజకీయం స్టార్ట్ చేసినట్లు ఏపీ రాజకీయాల్లో సరికొత్త వార్త వైరల్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదటినుండి తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర కంచుకోట. కానీ 2019 ఎన్నికలలో ఈ ప్రాంతంలో టిడిపి ఎక్కువ స్థానాలు గెలవలేకపోయింది. అయితే ఇప్పుడు పట్టా బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో టీడీపీ అభ్యర్థులు గెలవడంతో… క్యాడర్ మొత్తం సంతోషంగా ఉంది. పైగా వైజాగ్ రాజధాని అని వైసిపి ప్రకటించిన గాని తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టడంతో… వైసీపీ లోకి వెళ్లిన తన సన్నిహితులను తిరిగి టీడీపీ లోకి తీసుకొచ్చి జగన్ ని దెబ్బ మీద దెబ్బ కొట్టే పనిలో గంటా శ్రీనివాసరావు నిమగ్నమైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.