YS Jagan : వైసీపీకి రెబల్ గా మారిన ఆ పార్టీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. కొద్దిరోజుల క్రితం వైసీపీకి యాంటీగా మారిన కోటంరెడ్డి శ్రీరెడ్డి ప్రభుత్వం పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి సవాల్ విసిరారు. ఆయన చేసిన ఆరోపణలపై ఎఫెక్ట్ ప్రభుత్వం పై కాస్త గట్టిగానే పడిందని చెప్పాలి. అది ఫోన్ టాపింగ్ కాదని రికార్డింగ్ మాత్రమే అని ప్రభుత్వ పెద్దలు మంత్రులు, వైసీపీ నేతలు పదేపదే చెప్పారు. కోటంరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్ స్థానానికి నెల్లూరు సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించి ఆయనకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తుంది వైసిపి నాయకత్వం. కానీ కోటం రెడ్డి మాటల దాటిన ఎదుర్కొనే విషయంలో ఆయన సక్సెస్ కాలేకపోతున్నారు. తాజాగా కోటం రెడ్డి 5 ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టి వాళ్ళని రాజీనామా చేస్తే నేను కూడా రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు..
సైకిల్ గుర్తుపై గెలిచి వైకాపాకు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమైతే.. తాను కూడా సిద్ధమేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ విసిరారు.. వాళ్లను వదిలేసి తన గురించి మాట్లాడటం సరికాదు అన్నారు. చంద్రబాబు అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్లు కోటం రెడ్డి పునరుద్ఘటించారు. దాంతో వైసీపీ అధినేత జగన్ కి ఇండైరక్ట్ గా ఆ పార్టీలో నాయకులు బయటకు రావాలని సవాల్ విసిరారు.
ఐదుగురు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ జెండా మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు కదా సార్.. ముందు వాళ్లు రాజీనామా చేస్తే.. స్పీకర్ గా రాజీనామాని ఆమోదింప చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆమోదింప చేసుకుని.. అప్పుడు ఎన్నికలకి రమ్మని చెప్పండి. అప్పుడు నా రాజీనామా కోరండి.. తెలుగుదేశం పార్టీ బి ఫారం తీసుకొని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి.. రాజీనామాలు కాదు.
స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాలు ఇచ్చి స్పీకర్ గారూ ఆ రాజీనామాలను అంగీకరించి ఈ యొక్క శాసనసభ స్థానాలకి ఖాళీలు అని ఎలక్షన్ సభా కమిషన్ పెడితే.. ఆ రోజు మీరు నన్ను రాజీనామా అడిగితే ప్రజలు కూడా హర్షిస్తారు. మీరు చేస్తే పవిత్రత నేను చేస్తే మాత్రం అపవిత్రం పవిత్రత కాదు ఎంతవరకు న్యాయం సార్ అని కోటంరెడ్డి ప్రశ్నించారు. ఇది ప్రశ్న కాదు వివరణ ఇచ్చాను మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను అని కోటం రెడ్డి అన్నారు.