Modi – Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ గ్రాఫ్ రోజురోజుకీ మారిపోతుంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొన్నటిదాకా ఎటువంటి ఎన్నికలు నిర్వహించిన అత్యధికంగా వైసీపీ గెలవడం జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీ సీన్ అయిపోయిందన్న వార్తలు రావడం జరిగాయి. కానీ తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో దానికి ముందు పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో… తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధించింది. రాయలసీమ ప్రాంతంలో… జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో సైతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు బీజేపీ నాయకులు.. చంద్రబాబుతో కలిసి పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు సరికొత్త వార్త జాతీయ రాజకీయాల్లో ఏపీలో వినబడుతుంది.

బీజేపీ జాతీయ నాయకత్వం చంద్రబాబుని మళ్లీ దగ్గరికి తీసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందువల్లే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలలో ఢిల్లీలో జాతీయ బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసినట్లు సమాచారం. మొదటి నుండి తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ కలసి రాజకీయాలు చేయడం జరిగింది. 2014 వరకు ఆరీతిగానే..టీడీపీ..బీజేపీ బంధం కొనసాగింది. ఆ తర్వాత రెండు పార్టీలు విడిపోయాయి ఈ క్రమంలో 2019 ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రి కావడంతో మరింత గ్యాప్ ఏర్పడింది.
అయితే తాజా పరిస్థితులు బట్టి మళ్ళీ చంద్రబాబుతోనే కలిసి అడుగులు వేయడానికి మోడీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఇదే సమయంలో ఏపీ బీజేపీలో కీలక నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్ సైతం…ఎలక్షన్ కీ ముందు పొత్తు కలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దానికంటే ముందు బీజేపీ అగ్ర నేతలు సైలెంట్ గా ఆంధ్రాలో సీక్రెట్ సర్వే చేయించినట్లు అందులో చంద్రబాబు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు… ఫలితాలు వచ్చాయట. దీంతో మోడీ చంద్రబాబుతో బంధం ఏర్పరచుకోవడానికి సిద్ధమైనట్లు…జగన్ నీ దెబ్బ కొట్టడానికి బిగ్ వ్యూహాలు రెడీ చేస్తున్నట్లు ప్రజెంట్ ప్రచారం గట్టిగా జరుగుతుంది.