Big Boss 6 Telugu : కోర్టులో జడ్జిగారి ముందు టీవీలో బిగ్ బాస్ షో .. వింతలకే వింత ఇది.?

Big Boss 6 Telugu :  బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా 5 సీజన్లను పూర్తిచేసుకుంది.. ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తుంది.. ఈ సీజన్ కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమైంది.. అయితే తాజాగా ఈ షోను నిలిపివేయాలని.. ఏపీ హైకోర్టులో అడ్వకేట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేయగా ఆ పిటిషన్ పై కోర్టు స్పందించింది..!

Big Boss show on TV in front of the judge in the court

ఈ రియాలిటీ షోలో అశ్లీలత ఎక్కువైందని.. ఈ క్రమంలో ఈ షోను చట్టం ప్రకారం రాత్రి 11 నుంచి ఉదయం 5 మధ్యే.. ప్రసారం చేయాలని పిటిషన్ వేశారు. ఈ షోను నిలిపివేయాలనీ కె జగదీశ్వరరెడ్డి హైకోర్టులో వేసిన పిటీషన్ పై స్పందించిన కోర్టు.. రెండు, మూడు ఎపిసోడ్స్ చూస్తామని, ఆ తర్వాత తీర్పును ప్రకటిస్తామని తెలిపింది. అసలు బిగ్ బాస్ షోలో ఏముందో తెలుసుకుంటామని తెలిపింది కోర్టు. ఈ షో అశ్లీలంగా ఉందని ఫైల్ అయిన పిల్స్‌ను చీఫ్‌ జస్టిస్‌ పికె మిశ్రా, జస్టిస్‌ డివిఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ నిన్న మంగళవారం విచారణ జరిపింది. అందులో భాగంగా బిగ్‌బాస్‌ షోకు సంబంధించిన వివరాలను తమకు నివేదించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది కోర్టు. ఇక తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది.

కోర్టులో జడ్జెస్ బిగ్ బాస్ సీజన్ 6 షోలో కొన్ని ఎపిసోడ్స్ ను చూసి ఆ తరవాత డెసిషన్ చెబుదామని అన్నారు.. ఆ లాయర్ ఇప్పుడే ఈ షోలను మీరు చూస్తే అందులో ఉన్న తప్పులు ఏమిటో మీకు అర్థమవుతాయని అన్నారు.. అంతేకాదు వెంటనే అక్కడ ఉన్న టీవీ లో ఆ ఎపిసోడ్స్ లను చూడమని లాయర్ చెప్పగా.. జడ్జ్స్ వాటిని అలా చూడకుండా.. ఆ ఎపిసోడ్లను తర్వాత మేము చూసి నిశితంగా పరిశీలిస్తామని అన్నారు.. జడ్జెస్ అందరి ముందు అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే నిజంగా అశ్లీలత ఉందేమో.. ప్రజలందరి ముందు వాటిని చూడటం వలన అందరూ మరింత గొడవ చేసే అవకాశం లేకపోలేదు.. అందుకే ఈ వింతైన నిర్ణయం తీసుకున్నారని అనుకున్నారు..

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

8 months ago

This website uses cookies.