Chandrababu Naidu : మరోసారి చాణిక్యుడు అనీ నిరూపించుకున్న చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ విజయం..!!

Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఘన విజయం సాధించింది. 23 ఓట్లు రాబట్టడంతో అనూహ్యమైన విజయం టీడీపీ సొంతం అయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్.. కార్యకర్తలు మరియు నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో, ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. టీడీపీ బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించడం వెనకాల చంద్రబాబు చాణిక్యతే కారణమని విశ్లేషణలు వస్తున్నాయి. తెర వెనకాల నుండి ఆయన వైసీపీకీ దిమ్మతిరిగే రీతిలో రాజకీయాన్ని నడిపించి క్రాస్ ఓటింగ్ జరిగేలా… చేశారని  వార్తలు వస్తున్నాయి.

behind tdp won in mla quota mlc elections chandrababu master mind
behind tdp won in mla quota mlc elections chandrababu master mind

సొంత పార్టీ ఎమ్మెల్యేలలోనే జగన్ పై వ్యతిరేకత ఉందని చాలా సందర్భాలలో చంద్రబాబు మీడియా సమక్షంగా కామెంట్లు చేయడం జరిగింది. ఈ క్రమంలో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో రహస్య ఓటింగ్ నేపథ్యంలో వైసీపీ నుండి క్రాస్ ఓటింగ్ పడటంతో టీడీపీ గెలిచింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కచ్చితంగా గెలవాలంటే 22 మ్యాజిక్ ఫిగర్ దాటాలి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. దీంతో 19కి టీడీపీ బలం పడిపోయింది.

అయినా గాని జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ తరపున అనురాధానీ బరిలోకి దింపి పోటీ చేయించి గెలిపించుకోవడం జరిగింది. చంద్రబాబు తన చాణిక్యంతో వైయస్ జగన్ కి కంగు తినేలా …వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల చేత తన పార్టీకి ఓటు పడేలా వ్యవహరించినట్లు టాక్ నడుస్తుంది. ఇది కేవలం చంద్రబాబు పొలిటికల్ ఎత్తుగడలకు వచ్చిన విజయమని ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు తెలుగుదేశం పార్టీ మళ్లీ గెలుస్తూ… పుంజుకోవడంతో ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.