BalaKrishna : తారకరత్న మరణం పై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు పై బాలయ్య విరుచుకుపడ్డారు. అసలు నువ్వు ఎవరు ఈ విధంగా మాట్లాడడానికి .. నువ్వు నిజంగా మా ఇంటి కుటుంబ సభ్యురాలు అయితే ఇలా శవ రాజకీయాలు చేయవు. నీ వాళ్ళందరినీ వదులుకొని మా నాన్నకి సేవలు చేయడానికి నువ్వు వచ్చావు అంటే ఎవరు నమ్మరు. దురాశతో వచ్చే ఆయన పేరు ప్రతిష్టలను దెబ్బతీసి ఆయనకు అన్యాయం చేశావు.
ఆయన భార్య అని చెప్పుకునే నీకంటే బయట వాళ్ళు ఎంతో నయం. తల్లి గాని తల్లివి అయినా కూడా నీకు ఇప్పటి వరకు విలువ ఇస్తూ వచ్చాను కానీ నువ్వు ఇలా శవ రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదని బాలయ్య అన్నారు.
ఒకవేళ నిజంగా నారా లోకేష్ పాదయాత్ర రోజునే తారకరత్న చనిపోయి ఉంటే ఆ విషయం దాచి పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది. ఒకవేళ అది నిజమై మేము దాచిపెడితే నారా నందమూరి కుటుంబాలకు ఒరిగేది ఏమిటి. పోనీ మీరు అంటున్నట్టుగానే .. ఆ విషయాన్ని రాయడానికే ఇలా చేసాం అని అనుకోవచ్చు 23 రోజుల పాటు ఆ విషయాన్ని ఎలా దాయగాలం అని నందమూరి బాలకృష్ణ ఇలాంటి శవ రాజకీయాలు చేయద్దు. ఇలాంటి సమయంలో చేయడం కరెక్ట్ కాదని బాలకృష్ణ లక్ష్మీపార్వతి వ్యాఖ్యలను విమర్శించారు.

ఎప్పుడు చూసినా మా కుటుంబం గురించి చెడుగా మాట్లాడే వార్తలలో నిలవాలని మీరు ఇలా మాట్లాడడం సరి కాదని బాలకృష్ణ అన్నారు. నా బిడ్డ నందమూరి తారకరత్న 23 రోజులు పాటు మృత్యువుతో పోరాడి అనంత లోకాలకు వెళ్లిపోయాడు.. అందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఎవ్వరైనా సరే హద్దులు దాటి విమర్శిస్తే ఊరుకునేది లేదని బాలకృష్ణ అన్నారు. ఈ మాటలన్నీ ఓ పక్కన పెడితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఐసీయూలో ఉన్న తారకరత్నను చూసి వచ్చారు. తారకరత్న ఆరోగ్యం గురించి మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ ఆయన ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు అని మీడియా ముందు కూడా చెప్పారు విజయ్ సాయి రెడ్డి. ఒకవేళ అందరూ అనుకుంటున్నా మాటలు ప్రకారం..
ఆ పార్టీకే తారకరత్న చనిపోయి ఉంటే అలాంటి మాటలు విజయ్ సాయి రెడ్డి మాట్లాడేవారు కాదు కదా.. అటు నందమూరి ఇటు నారా కుటుంబాన్ని కచ్చితంగా నిలదీసేవారు.. ఇక వైసిపి వారు కూడా తారకరత్న ముందుగా మరణించలేదని అనుకుంటున్నారు. అయితే నందమూరి కుటుంబం అంటే లక్ష్మీపార్వతి కి ముందు నుంచి పడదన్న సంగతి అందరికీ తెలిసిం.దే అందుకే తారకరత్న మరణాన్ని ఈ విధంగా వాడుకున్నారని అందరికీ తెలిసిందే. విషాద ఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ధైర్యం చెప్పే విధంగా ఉండాలి కానీ ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అందరి వాదన.